సినిమా కాంబినేషన్లే కాదు.. సినీ నటుల జీవితాలు కూడా అంతే. సెట్టైపోయినట్టే అనుకున్న కాంబోలు కాస్తా.. ఫట్టుమని తెగిపోతుంటాయి. పెళ్లిపీటల వరకూ వెళ్లి కూడా శుభం కార్డు పడకుండా.. ట్రాజెడీగా ముగిసిపోతుంటాయి. ఇలా.. ఒకసారి కాదు, రెండు సార్లు దెబ్బతిన్నాడు బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్. అది కూడా ఇద్దరు స్టార్ హీరోయిన్లతోనే ప్రేమలో ఫెయిలయ్యాడు! ఇంతకీ.. వారిద్దరు ఎవరు? మనోడి లవ్ కహానీ ఏంటనేది చూద్దాం.
1997 నాటి ముచ్చట. రాజ్ కపూర్ మనవడు నిఖిల్ నందాకు, అమితాబ్ బచ్చన్ కుతురు శ్వేతా బచ్చన్ కు వివాహం నిశ్చయమైంది. పెళ్లిలో పెద్దవాళ్లు భోజనాలు, మర్యాదల కోసం వస్తారుగానీ.. మెజారిటీ యువతీ యువకులు మాత్రం సైట్ కొట్టడానికే వస్తారు. అలా.. ఈ పెళ్లిలో అభిషేక్ బచ్చన్ చూపు ఓ యువతిపై నిలిచిపోయింది. ఆమె మరెవరో కాదు.. కరిష్మా కపూర్. అప్పటికే కరిష్మా స్టార్ హీరోయిన్. అభిషేక్ మాత్రం కెమెరా ముందుకు రాలేదు.
సీన్ కట్ చేస్తే.. 2000 సంవత్సరంలో అభిషేక్ ఫస్ట్ మూవీ సిద్ధమైంది. సినిమా పేరు ‘రెఫ్యూజీ’. అందులో హీరోయిన్ ఎవరో కాదు.. కరిష్మా సిస్టర్ కరీనా కపూర్. ఈ మూవీ సమయంలో తరచూ సెట్స్ కు రావడం.. రాసుకుపూసుకు తిరగడంతో.. మీడియా పసిగట్టింది. అభిషేక్-కరిష్మా మధ్య ఏదో నడవడమే కాదు.. పరిగెడుతోందని. నిజమే మరి.. మూడేళ్లు సాగుతూనే ఉంది. ఈ విషయం చివరకు పేరెంట్స్ వద్దకు వెళ్లింది.
వన్ ఫైన్ డే రానే వచ్చింది. అది కూడా మరిచిపోలేని రోజు. అమితాబ్ బచ్చన్ షష్టిపూర్తి. 60వ బర్త్ డే వేడుకలు. ఈ సంతోష సమయంలోనే వారిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఎంగేజ్ మెంట్ కూడా జరిపించేశారు. కొన్నాళ్ల తర్వాత జీవిత సినిమాలో అనుకోని ట్విస్ట్. ఈ నిశ్చితార్థం రద్దయిపోయింది! కారణం ఏంటన్నది ఈ రోజు వరకూ బయటకు రాలేదు. కానీ.. గాసిప్స్ వస్తూనే ఉంటాయిగా! అప్పట్లో.. అమితాబ్ ఫైనాన్షియల్ గా ఇబ్బందులో ఉన్నారు. దీంతో.. తన కూతురు ఎక్కడ ఇబ్బంది పడుతుందోనని.. కాబోయే అల్లుడు అభిషేక్ వాటా అతని పేరు మీద రాయాలని కరిష్మా తల్లి అడిగిందట. దీంతో.. జయాబచ్చన్ ఆవేదన వ్యక్తంచేసిందట. ఫలితంగా.. వారి ప్రేమ నిశ్చితార్థంతోనే ముగిసిపోయింది.
ఆ తర్వాత.. కొన్నాళ్లకు మరో స్టార్ రాణీముఖర్జీతో లవ్ లో పడ్డాడు అభిషేక్. ఈ సారి పెళ్లి ఖాయం అనుకున్నారు అంతా. బచ్చన్ ఫ్యామిలీ కూడా ఫుల్ హ్యాపీ. కానీ.. మనిషిలో ఇగో ఒక్కటి చాలుకదా అన్నింటినీ సర్వనాశనం చేయడానికి! ఇక్కడ కూడా అదేజరిగింది. జయాబచ్చన్-రాణీ ముఖర్జి కలిసి ‘లగా చునరీ మే దాగ్’ చిత్రంలో నటించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏదో అభిప్రాయ భేదం వచ్చిందట. అక్కడ రాణిముఖర్జీ దురుసుగా మాట్లాడిందట. జయా నొచ్చుకుంది. ఖతం.. అమ్మ బాధను చూడలేని అభిషేక్ రాణీకి సైతం టాటా చెప్పాల్సిన పరిస్థితి.
కరిష్మాతో జట్టుకట్టినా.. రాణీతో సింహాసనం షేర్ చేసుకున్నా.. అభిషేక్ జీవితంలో ఐశ్వర్య ఉండేదా? జీవితం ఒక నాటకరంగం అంటే ఇది కాదూ..?!