2016లో రొమాన్స్‌ తీరు మారింది

Update: 2016-02-13 11:30 GMT
అన్ని సినిమాల్లోనూ లవ్ ఉంటుంది కానీ.. అన్నీ సినిమాలు లవ్ చుట్టూరా తిరిగేవి కావు. ఈ ఏడాది ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలొచ్చినా.. అందులో మెయిన్ ప్లాట్ ని ప్రేమగా తీసుకున్నవి ఓ నాలుగు సినిమాలున్నాయ్. పైగా ఆ రొమాన్స్‌ తీరు మారింది. ఎనర్జిటిక్ హీరో రామ్ - నాగ శౌర్య - శర్వానంద్ - రాజ్ తరుణ్ లు ఒక నెలలోనే వచ్చేసి తమ ప్రేమలకు పరీక్ష పెట్టుకున్నారు. తమ ప్రియురాళ్ల కోసం ఏదైనా సరే చేసేశారు.

జనవరి 1న రామ్ - కీర్తి సురేష్ జంటగా నటించిన నేను.. శైలజ మూవీలో.. ఓ ప్లేట్ పానీపూరీ కోసం వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తాడు రామ్. గోవాకు షార్ట్స్ లోనే వెళ్తానంటాడు. ఇదంతా కీర్తి సురేష్ ప్రేమ కోసమే. ఇక న్యూఇయర్ రోజునే రిలీజ్ అయిన మరో మూవీ అబ్బాయితో అమ్మాయి. తనకు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చిన హీరోయిన్ కి.. బస్సులో ఉన్న హీరోకి కిందవరకూ ఒంగి లిప్ కిస్ పెట్టే సీన్ చూశారా. నాగశౌర్య అదే చేశాడు, ఆకట్టుకున్నాడు కూడా. అంతే కాదు.. వీళ్లు మంచి మూడ్ లో ఉన్నపుడు హీరోయిన్ పాలక్ లల్వానీ ని గెంటేస్తే.. తనే ఫీజులు కడతాడు, ఇల్లు వెతికిపెడతాడు, అలా ఆమెను గెలుచుకుంటాడు.

ఇక సంక్రాంతికి వచ్చిన శర్వానంద్ అయితే.. ఓ కుక్కని పట్టుకొచ్చేసి సురభితో ప్రేమను గెలుచుకునేందుకు నానా పాట్లు పడతాడు. అంతేనా కుక్క కోసం 77వేలు కలెక్ట్ చేసేందుకు డిక్షనరీలను సూపర్ ఫాస్ట్ గా అమ్మేస్తాడు శర్వానంద్. ఇక కొత్త కుర్రాడు రాజ్ తరుణ్ అయితే అమ్మాయి ఆర్తనని గెలుచుకునేందుకు వాళ్ల బ్రదర్ మనసులో స్థానం సంపాదించాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ చిన్నపుడు తను ఆడ్డం మానేసిన క్రికెట్ మళ్లీ ఆడి ఆర్తనను దక్కించుకుంటాడు. కొత్త సినిమాల్లో ప్రేమ కాన్సెప్టులు కూడా మారుతున్నాయ్ చూశారా.

Tags:    

Similar News