పవన్ కళ్యాణ్ హీరోగా ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన వకీల్ సాబ్ సినిమా యూఎస్ లో మిలియన్ డాలర్లను వసూళ్లు చేస్తుందని అంతా భావించారు. కాని కరోనా భయం ఆ సమయంలో తీవ్రంగా ఉండటంతో పాటు ఇతర కారణాల వల్ల సినిమా 7.6 లక్షల డాలర్ల వద్ద ఆగిపోయింది. ఆ తర్వాత మరే తెలుగు సినిమా కూడా అక్కడ ఈ రేంజ్ లో వసూళ్లు దక్కించుకున్న దాఖలాలు లేవు. వకీల్ సాబ్ యూఎస్ వసూళ్లను క్రాస్ చేసేందుకు చాలా సమయం పడుతుందని.. అది టాలీవుడ్ స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యం అనుకుంటున్న సమయంలో సునాయాసంగా కేవలం రెండు రోజుల్లోనే వకీల్ సాబ్ వసూళ్లను లవ్ స్టోరీ దాటేసింది. రెండు రోజుల్లోనే 7.6 లక్షల డాలర్లను లవ్ స్టోరీ యూఎస్ బాక్సాఫీస్ వద్ద దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.
వీకెండ్ వరకు మిలియన్ మార్క్ ను చేరుకుంటుందని.. తద్వారా లవ్ స్టోరీ అరుదైన ఘనత దక్కించుకోబోతున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు సినిమాలు యూఎస్ బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్లు అంటే గతంలో చాలా కామన్ విషయం. మిలియన్ డాలర్లు వసూళ్లు చేస్తే అంతేనా అన్నట్లుగా ఉండేది. కాని ఇప్పుడు కరోనా పరిస్థితుల కారణంగా సినిమా అక్కడ భారీగా వసూళ్లు సాధించలేక పోతుంది. లక్షల డార్లు రాబడితేనే చాలా పెద్ద విషయం అన్నట్లుగా చూస్తున్నారు. అలాంటిది అక్కడ మిలియన్ డాలర్లు అది కూడా ఒక తెలుగు సినిమా. హాలీవుడ్ సినిమాలు కూడా ఈమద్య కాలంలో మిలియన్ డాలర్ల విషయంలో కాస్త దూరంగా ఉంటున్నారు. కరోనా తర్వాత మొదటి సారి ఒక తెలుగు సినిమా యూఎస్ లో మిలియన్ డాలర్లను వసూళ్లు చేయబోతుందని అంటున్నారు.
శేఖర్ కమ్ములకు యూఎస్ లో మంచి మార్కెట్ ఉంది. దానికి తోడు ఫిదా బ్యూటీ సాయి పల్లవి ఈ సినిమా లో హీరోయిన్ మౌనిక పాత్రలో నటించడం వల్ల అక్కడి వారు సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను దక్కించుకుంటున్న లవ్ స్టోరీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లను సాధించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల వసూళ్లు పది కోట్లను మించాయి. లాంగ్ రన్ లో ఈ సినిమా భారీ వసూళ్లను దక్కించుకోవడం ఖాయం అంటున్నారు. వకీల్ సాబ్ కు యూఎస్ లో వచ్చిన వసూళ్లకు దాదాపుగా డబుల్ లవ్ స్టోరీకి వస్తాయని అంతా నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. చైతన్య 'రేవంత్' పాత్రకు న్యాయం చేయగా.. మౌనికగా సాయి పల్లవి జీవించేసింది. అందుకే యూఎస్ ఆడియన్స్ సినిమాను తెగ ఆధరిస్తున్నారు.