నాగచైతన్య - సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన లవ్ స్టోరి బిజినెస్ రేంజ్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. కమ్ముల బ్రాండ్ మూవీకి చై - సాయిపల్లవి కెమిస్ట్రీ బాగా కుదిరిందని టాక్ రావడంతో దాదాపు 50 కోట్ల మేర ప్రీబిజినెస్ సాగించిందన్న టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 32.8 కోట్ల రూపాయాల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆంధ్ర హక్కులు 16.8 కోట్లు దక్కింది. శేఖర్ కమ్ముల సినిమాలకు ఉండే డిమాండ్ దృష్ట్యా విదేశాల్లో 4 కోట్లకు రైట్స్ చేజిక్కించుకున్నారు. నైజాంలో నిర్మాత నారంగ్ కి సొంత డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి సొంతంగా రిలీజ్ చేసుకుంటారు. ఒక్క నైజాంలోనే 11 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని సమాచారం. శాటిలైట్ - డిజిటల్ రైట్స్ అన్నీ కలిపి దాదాపు 50 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ సాగిందట.
లవ్ స్టోరి చిత్రాన్ని ప్రేమ జంటల మధ్య అండర్ స్టాండింగ్ ఎగ్జిస్టెన్సీ పై తెరకెక్కించానని కమ్ముల అన్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే వచ్చే మనస్ఫర్థలను తెరపై ఆవిష్కరిస్తున్నారు. సెప్టెంబర్ 24న సినిమా విడుదలవుతోంది.