ప్చ్.. ఫ్యాషన్ వీక్ లో సల్మాన్ లవర్

Update: 2017-02-05 04:43 GMT
లాక్మే ఫ్యాషన్ వీక్ ఎన్నెన్నో అందాలకు వేదికగా మారుతోంది. ట్రెండీ అందాలకు.. లేటెస్ట్ ఫ్యాషన్ ను అందిపుచ్చుకునే అందాల భామలు.. తన ట్యాలెంట్ ను ఇక్కడ ప్రదర్శించేస్తున్నారు. ఇప్పటివరకూ చాలామంది సుందరాంగులు ఇక్కడ దర్శనం ఇవ్వగా.. తాజాగా సల్మాన్ ఖాన్ గాళ్ ఫ్రెండ్ గా ఇండియా అంతా ఫేమస్ అయిన లూలియా వంతూర్ అల్ట్రామోడర్న్ డ్రెస్ తో సందడి చేసింది.

బ్లాక్ టాప్ మాత్రమే వేసుకున్న లూలియా.. ఇన్నర్స్ తో క్లీవేజ్ ను కవర్ చేసే యత్నం చేసినా.. ట్రాన్స్ పరెంట్ వేర్  కావడంతో.. వాటి ఉద్దేశ్యం నెరవేరలేదు. రొమేనియన్ మోడల్ అయిన లూలియాకు కెమేరా కొత్తేమీ కాదు కాబట్టి.. ఫోటో సెషన్ విషయంలో ఏ మాత్రం తడబడలేదు ఈ సుందరి. అలాగే హైహీల్స్ వేసుకుని.. మోకాళ్లకు అడుగు పైవరకూ మాత్రమే కవర్ చేస్తున్న టాప్ కావడంతో.. కాలి అందాలు కూడా మిలమిల్లాడుతూ దర్శనమిచ్చాయి. లూలియాను ఈ రేంజ్ లో చూసిన సల్లూ భాయ్ ఫ్యాన్స్ షాక్ తినేశారనే చెప్పాలి.

కేవలం సల్మాన్ ఖాన్ గాళ్ ఫ్రెండ్ గా మాత్రమే కాకుండా.. హిమేష్ రేషమ్మియాతో మ్యూజిక్ ఆల్బంలో.. ఓ అవార్డ్ ఫంక్షన్ లో షారూక్ ఖాన్ తో కలిసి హోస్టింగ్ చేస్తూ కూడా గతంలో సందడి చేసింది లూలియా వంతూర్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News