2.0 టీజర్.. ట్విస్టిచ్చారు బాబోయ్

Update: 2018-01-05 07:10 GMT
2.0 రిలీజ్ తరువాత ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో తెలియదు గాని ప్రస్తుతం అర్ధం లేని వార్తలతో కన్ఫ్యూజన్ ని మాత్రం చాలా పెద్దగా క్రియేట్ చేస్తోంది. ఓ సినిమాకు రూమర్స్ రావడం చాలా కామన్ కానీ 450 కోట్లతో తెరకెక్కిస్తున్న సినిమా గురించి అర్ధం లేని రూమర్స్ రావడం అంటే చిత్ర యూనిట్ తప్పకుండా పట్టించుకోవాలి. ఒక వార్త అందరి మైండ్ లో బలంగా పాతుకుపోయిన తరువాత కానీ 2.0 వారు నిద్రలేవడం లేదు.

ఇటీవల 2.0 టీజర్ జనవరి 6న తెలుగు తమిళ్ తో పాటు హిందీ అలాగే అరబ్ లో కూడా రిలీజ్ కానుంది అని ఇదే అదికారికంగా వెలువడిన అప్డేట్ అని కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. అందుకు కారణం కూడా ఉంది. ఈ నెల 6వ తేదీన మలేషియాలో నడిగర్ సంఘం ఆధ్వర్యంలో స్టార్ నైట్ జరగబోతోంది. అయితే దాని గురించి ప్రెస్ మీట్ పెట్టిన కార్తీ 2.0 ఆ రోజే రిలీజ్ అవుతోందని చెప్పాడు. దీంతో అందరు అదే నిజమని అనుకున్నారు. అయితే ఈ విషయంపై ఇటీవల చిత్ర నిర్మాణ సంస్థ లేక ప్రొడక్షన్ వివరణ ఇచ్చింది. టీజర్ ఇప్పుడే రిలీజ్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది.  దీంతో అందరు ఒక్కసారిగా నిరాశ చెందారు. కేవలం సినిమాకు సంబందించిన ఒక వీడియోని ప్రదర్శిస్తారని తెలుస్తోంది.

అయితే టీజర్ రిలీజ్ పై దర్శకుడు శంకర్ ప్రత్యేక ప్రణాళికలను రచిస్తున్నాడట. అసలు 2017 నవంబర్ లో హైదరాబాద్ లోనే టీజర్ ను రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ పనుల వల్ల ప్లాన్స్ అన్ని తారుమారయ్యాయి. ఇక ఫైనల్ గా ఫిబ్రవరిలో రిలీజ్ చేసే ఆలోచనలో శంకర్ ఉన్నట్లు తెలుస్తోంది.  సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతోందని రజినీకాంత్ ఇటీవల ఫ్యాన్స్ మీటింగ్ లో తెలియజేసిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News