పవన్ కళ్యాణ్ కెరీర్ లో అన్ని రకాలుగా చాలా స్పెషల్ గా నిలిచిపోయిన మూవీ అత్తారింటికి దారేది. ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాయడమే కాక విడుదలకు ముందే సినిమా లీకైపోయినా దాని ప్రభావం లేకుండా చరిత్ర సృష్టించడం ఎవరూ మర్చిపోలేరు. కథలో ఉన్న దమ్ముతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ టేకింగ్ సినిమా లెవెల్ ని అమాంతం పెంచేసింది. ఇప్పటికే కన్నడలో రెండేళ్ల క్రితం ఈగ విలన్ సుదీప్ హీరోగా రన్నా పేరుతో రీమేక్ అయ్యి అక్కడ కూడా ఫలితాన్ని రిపీట్ చేసింది.
ఇప్పుడు తమిళ్ వంతు వచ్చింది. 2.0 లాంటి క్రేజీ మూవీస్ ని నిర్మిస్తున్న లైకా సంస్థ దీని హక్కులను కొనుగోలు చేసినట్టు సమాచారం. గతంలోనే ఈ డీల్ జరిగినప్పటికీ హీరో దర్శకుడు ఎవరూ అనే దాని గురించి అంత సీరియస్ గా ఆలోచించలేదు. కానీ ఇప్పుడు నిర్మాణం దిశగా అడుగులు పెడుతున్నట్టుగా తెలిసింది. అత్తారింటికి దారేది తమిళ్ వెర్షన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయట. కానీ హీరో ఎవరు అనే విషయం ఇంకా తెలియడం లేదు. విజయ్ తో పాటు అజిత్ పేరు కూడా పరిశీలనలో ఉంది. తమిళ్ లో హిట్ అయిన విజయ్ సినిమాలు ఖుషి-అన్నవరం లాంటివి పవన్ రీమేక్ చేసుకున్నాడు. అలాగే తెలుగు హిట్స్ అంటే విజయ్ కు చాలా మక్కువ. అతనొక్కడే-పోకిరి లాంటివి అతని ఖాతాలో ఉన్నాయి. అందుకే అత్తారింటికి దారేది విజయ్ కి బాగా సూట్ అవుతుందని అతని అభిమానుల కోరిక.
మరోవైపు అజిత్ కూడా దీనికి పర్ఫెక్ట్ ఛాయస్ అని తలా ఫాన్స్ కూడా కోరుతున్నారు. మొత్తానికి ఇది ఎవరి దగ్గర ఆగుతుందో తెలియదు కానీ బ్లాక్ బస్టర్ మెటీరియల్ ఉన్న అత్తారింటికి దారేదిని ఈ ఇద్దరిలో ఎవరు చేసినా రేంజ్ తగ్గదు. విజయ్ మురుగదాస్ సర్కార్ తో బిజీ ఆ ఉండగా అజిత్ శివ దర్శకత్వంలో చేస్తున్న విశ్వాసం ఫినిషింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.