రోబోకు బాహుబలి ప్రమోషన్

Update: 2017-06-17 07:35 GMT
బాహుబలి రిలీజయినప్పటి నుంచి పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేయంతో పాటు కొత్త రికార్డులెన్నింటినో సృష్టించింది. దేశం మొత్తం బాహుబలి మార్మోగిపోయిది. ఆ సినిమా కథలోని రాజమాత శివగామి పాత్రతో సీరియల్ కూడా రెడీ అయిపోతోంది. మొత్తంమీద బాహుబలి పేరే ఓ బ్రాండ్ ఇమేజ్ గా మారిపోయింది.  తాజాగా బాహుబలి ఇమేజ్ తో లాభపడాలని చూస్తున్న వారిలో సూపర్ స్టార్ రజనీతో రోబో సీక్వెల్ తీస్తున్న 2.0 మేకర్స్ లైకా ప్రొడక్షన్స్ కూడా చేరిపోయింది.

బాహుబలి హిందీ వెర్షన్ ను ఏఏ ఫిలిమ్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ విడుదల చేశారు. ఏఏ ఫిలిమ్స్ రెండు దశాబ్దాలుగా సినిమా పంపిణీ రంగంలో ఉన్నా సౌత్ జనాలకు బాగా నోటయ్యింది బాహుబలి సినిమాతోనే. దీని తర్వాత ఏఏ ఫిలిమ్స్ 2.0 హిందీ వెర్షన్ థియేటరికల్ రైట్స్ దక్కించుకుంది. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం ‘‘ఏఏ ఫిలిమ్స్ కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. బాహుబలి-2 పంపిణీదారులతో కలిసి 2.0 హిందీ వెర్షన్ విడుదల చేయబోతున్నాం’ అంటూ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు.

హోల్ ఇండియాలో రజనీ పేరే ఒక బ్రాండ్. అలాంటిది రజనీ సినిమాకు మరో సినిమా బ్రాండ్ ఇమేజ్ ఉపయోగపడుతుందని నిర్మాతలు భావించారంటే అది మామూలు విషయమేం కాదు. ఫ్రం ద డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ బాహుబలి అనే ట్యాగ్ లైన్ తో  హిందీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయాలని చూస్తున్నారు 2.0 ప్రొడక్షన్ టీం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News