లిరిసిస్ట్ ప‌దేళ్ల ప్రేమ‌కు పెళ్లితో శుభం కార్డ్

Update: 2020-11-23 13:00 GMT
మ‌నసిచ్చాడు.. ప‌దేళ్లుగా ఆమె ప్రేమ‌లోనే ఉన్నాడు. ఇప్పుడు పెళ్లితో శుభం కార్డ్ వేశాడు. ఆ ప్రేమ‌లోనే బోలెడ‌న్ని ప్రేమ‌క‌విత‌లు అల్లి పాట‌కు కానుక‌గా అందించాడు. ఇంతగా ప్రేమ‌ను స‌క్సెస్ చేసుకునేందుకు త‌పించిన లిరిసిస్ట్ ఎవ‌రు?.. అంటే ఇంకెవ‌రు.. ట్యాలెంటెడ్ యంగ్ బోయ్ శ్రీ‌మ‌ణి. టాలీవుడ్ లో ఎన్నో చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్ కి లిరిసిస్టుగా ప‌ని చేసిన శ్రీ‌మ‌ణికి స్టార్ డైరెక్ట‌ర్లు మ్యూజిక్ డైరెక్ట‌ర్లు.. హీరోలంద‌రికీ ఎంతో స‌న్నిహితుడిగా సుప‌రిచితుడు.

ఫ‌రా అనే యువ‌తితో ప‌దేళ్లుగా ప్రేమ‌లో ఉన్న శ్రీ‌మ‌ణి చివ‌రికి పెద్ద‌ల్ని ఒప్పించి పెళ్లాడారు. త‌న పెళ్లికి సంబంధించిన ఫొటోల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా సెల‌బ్రిటీల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. ముఖ్యంగా త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన దేవీశ్రీ రొమాంటిక్ విషెస్ స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

``నా జీవితంలోకి ఫ‌రాకు స్వాగతం చెబుతున్నాను. గ‌త ప‌దేళ్ళుగా ఈ క్ష‌ణం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశాం. ఎట్ట‌కేల‌కు మా క‌ల సాకార‌మైంది. మా మ‌న‌సుల‌ని అర్థం చేసుకున్న దేవుడికి త‌ల్లిదండ్రుల‌కి ధ‌న్య‌వాదాలు`` అంటూ ఉద్వేగానికి లోన‌య్యారు శ్రీ‌మ‌ణి. 100 ప‌ర్సంట్ ల‌వ్ మొద‌లు ప్ర‌స్తుతం రిలీజ్ కి రెడీ అవుతున్న ఉప్పెన వ‌ర‌కూ కెరీర్ లో చ‌క్క‌ని పాట‌ల్ని అందించారు.

``ఇష్క్ సిఫాయా అని పాడి.. రంగులద్దుకున్న అని సీక్రెట్ గా లవ్వాడి..ఏమిటో ఇది అని మేమందరం అనుకునేలా పెళ్లిచేసుకున్నారన్న మాట`` అంటూ శ్రీ‌మ‌ణిని ఆట‌ప‌ట్టించారు దేవీశ్రీ‌.
Tags:    

Similar News