మరికొన్ని రోజుల్లో జరగబోయే 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల వివాదం రోజురోజుకీ ముదురుతోంది. అధ్యక్ష పదవి కోసం బరిలో దిగుతున్న మంచు విష్ణు - ప్రకాశ్ రాజ్ ల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. విష్ణు - మోహన్ బాబు కలిసి సీనియర్ల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. ప్రకాష్ రాజ్ కు మెగా అండదండలు లభిస్తున్నాయి. ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో రెండు ప్యానెల్స్ సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు.. వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లారు. ఈ క్రమంలో 'మా' ఎలక్షన్స్ సార్వత్రిక ఎన్నికల తరహాలో రసవత్తరంగా మారాయి.
'పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే కలెక్షన్స్ అంత ఉండదు విష్ణు సినిమా బడ్జెట్' అని ప్రకాష్ రాజ్ అంటే.. 'గత కర్ణాటక ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని.. అది అతని ఎన్నికల కెరీర్ కు నిదర్శనమ'ని విష్ణు కౌంటర్ వేశారు. అలానే ఎన్నికలు ఈవీఎంల ద్వారా జరపాలని ప్రకాశ్ రాజ్ వర్గం కోరుతుంటే.. బ్యాలెట్ పేపర్ తో నిర్వహించాలని విష్ణు కోరుతున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత విషయాలపై కూడా ఇరు వర్గాలు విమర్శలు చేసుకుంటున్నారు.
ఇదే సమయంలో లోకల్ - నాన్ లోకల్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. 'మా' సంస్థని మనం నడుపుకోలేమా, బయటివారు కావాలా? అని రాజీవ్ కనకాల - రవిబాబు లాంటి వారు అంటుంటే.. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఇక్కడి వారేనా? అని జీవితా రాజశేఖర్ వంటి వారు ప్రశ్నిస్తున్నారు. ఈ కాటమాప్రకాశ్ రాజ్ లాంటి వాడు ఒక్కసారిగా కాదు మూడుసార్లు అధ్యక్షుడిగా ఉండాలని నాగబాబు అంటున్నారు. 'మా' అసోసియేషన్ మసకబారబోతుందని.. 'మా' ప్రతిష్టను దిగజార్చడానికి కుట్ర చేస్తున్నారని మెగా బ్రదర్ ఆరోపిస్తున్నారు.
మరోవైపు 'మా' అధ్యక్ష పోటీ నుంచి వైదొలగిన సినీ నటుడు సీవీఎల్ నరసింహరావు.. ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. రెండు ప్యానెల్స్ లో ఉన్న తెలంగాణ బిడ్డలను గెలిపించకపోతే సినిమా పరిశ్రమకు, సమాజానికి మంచిది కాదని.. దేశమన్నా దేవుడన్నా, ధర్మమన్నా చులకన భావన ఉన్న ప్రకాశ్ రాజ్ ను తప్పకుండా ఓడించాలని సీవీఎల్ అంటున్నారు.
ఇలా 'మా' సభ్యుల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు టాలీవుడ్ పెద్దలతో సహా అందరినీ అసంతృప్తికి గురిచేస్తున్నాయని తెలుస్తోంది. కేవలం 900 మంది సభ్యులతో కూడిన 'మా' ఎన్నికల వ్యవహారం.. ఇప్పుడు అసెంబ్లీ లేదా పార్లమెంటు ఎన్నికలను తలపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న 'మా' వివాదం చూసి సామాన్య ప్రజలు నవ్వుకునే పరిస్థితి వచ్చింది.
మీడియాలో కూడా ఇదే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ ఎన్నికల గురించి.. అభ్యర్థుల చేష్టలకు సంబంధించి అనేక ట్రోల్స్ - మీమ్స్ దర్శనమిస్తున్నాయి. MAA ఎన్నికల వ్యవహారం ఒక రియాలిటీ షో డ్రామాను తలపిస్తోందని.. ఇది టాలీవుడ్ ప్రతిష్ఠతను దిగజారుస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పోటా పోటీగా ప్రెస్ మీట్స్ పెట్టి వివాదాన్ని పెద్దది చేయకుండా.. ఒక ఫ్యామిలీగా 'మా' ఇంటి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ కు ఇంకా మూడు రోజుల సమయం ఉండగా.. ఈ గ్యాప్ లో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
ఇదిలా ఉండగా 'మా' ఎన్నికల పోలింగ్ పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే జరుగుతుందని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పష్టం చేశారు. ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు అభ్యర్థనల్ని క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజు పరిశీలించి.. పోస్టల్ బ్యాలెట్ కే మొగ్గు చూపారు. దీని కోసం స్థానిక ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరపాలని సుప్రీంకోర్టు 2019లో ఇచ్చిన ఉత్తర్వుల్ని కూడా పరిగణనలోకి తీసుకున్నామని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు.