విలక్షణ హాస్య నటుడు మాడా వెంకటేశ్వరరావు మరణించారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ఆయన శనివారం రాత్రి 11 గంటల సమయంలో కన్నుమూశారు. పాతతరం హాస్య నటుల్లో మాడా ఒకరు. ఆయన పేరు చెప్పినంతనే అందరి మదిలో.. ‘‘చూడు పిన్నమ్మా.. పాడు పిల్లోడు.. పైనపైన పడతనంటాడు’’ అన్న పాట గుర్తుకు రాక మానదు.
కొద్దికాలంగా అస్వస్థతతో ఉన్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 1950 అక్టోబర్ 10న జన్మించిన ఆయన ఇప్పటివరకూ 350కు పైగా చిత్రాల్లో నటించారు. విభిన్నమైన వేషధారణతో.. విలక్షణమైన మాడ్యులేషన్ తో అలరించే ఆయన మొదట నాటక రంగంలో పలు ప్రదర్శనలు వేశారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్లలో ఆయన జన్మించారు. ఆయనకు నలుగురు కుమార్తెలు.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలో ఇంజనీర్ గా విధులు నిర్వహించిన ఆయన.. నాటకాల మీదున్న అభిమానంతో ప్రదర్శనలు వేసేవారు. అలా ఆయన్ను చూసిన దివంగత బాపూ తన చిత్రంలో మాడాకు అవకాశం ఇచ్చారు. అలా మొదలైన ఆయన కెరీర్.. దాసరి దర్శకత్వంలో వచ్చిన చిల్లరకొట్టు చిట్టెమ్మ ఆయనకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. బాపూ దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు చిత్రంలో కేవలం రెండు నిమిషాల పాత్ర పోషించినా.. ఆయన తెలుగుప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు.
మాడా మరణవార్తతో సినీ అభిమానులు.. చిత్ర పరిశ్రమ విషాదం నెలకొంది. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు పలువురు ఆసుపత్రికి చేరుకున్నారు.