తెలుగులో మళ్లీ మాధవన్‌..

Update: 2018-11-05 10:04 GMT
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మాధవన్‌ తాజాగా నాగచైతన్య ‘సవ్యసాచి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సవ్యసాచి చిత్రం ఫలితం పక్కన పెడితే మాధవన్‌ పాత్రతో సినిమాకు హైప్‌ వచ్చింది. మాధవన్‌ విలన్‌ అంటూ ప్రచారం జరగడంతో సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది. మాధవన్‌ కు తెలుగులో మంచి క్రేజ్‌ ఉన్న కారణంగా ‘సవ్యసాచి’ చిత్రంకు మంచి బిజినెస్‌ కూడా దక్కింది. తెలుగులో మాధవన్‌ కు మంచి క్రేజ్‌ ఉందని సవ్యసాచి చిత్రంతో నిరూపితం అయిన కారణంగా తమిళంలో మాధవన్‌ నటించిన ‘విక్రమ్‌ వేధా’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

తమిళనాట మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విక్రమ్‌ వేధా చిత్రం రీమేక్‌ రైట్స్‌ కోసం తెలుగు నిర్మాతలు ప్రయత్నాలు చేశారట. కాని ఆ చిత్రాన్ని నిర్మించిన వైనాట్‌ సంస్థ మాత్రం తమ వద్దే ఆ రైట్స్‌ ను అంటి పెట్టుకుని ఉందట. దాంతో ఇప్పుడు ఆ సంస్థ తెలుగులో రీమేక్‌ కు ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులో నేరుగా వైనాట్‌ సంస్థ విక్రమ్‌ వేధా చిత్రాన్ని రీమేక్‌ చేయబోతున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

పుష్కర్‌ ` గాయత్రి అనే భార్య భర్తలు ‘విక్రమ్‌ వేధా’ చిత్రాన్ని రూపొందించారు. తెలుగులో ఈ చిత్రం రీమేక్‌ రైట్స్‌ ను సుధీర్‌ వర్మకు అప్పగించాలని భావిస్తున్నారు. మాధవన్‌ తమిళ వర్షన్‌ లో నటించినట్లుగా మెయిన్‌ లీడ్‌ లో నటించబోతున్నాడు. మరో మెయిన్‌ లీడ్‌ లో విజయ్‌ సేతుపతి నటించాడు. ఆ పాత్రకు విజయ్‌ ని తీసుకుంటారా లేదంటే తెలుగులో ఎవరైనా పాపులర్‌ నటుడిని తీసుకుంటారా అనేది చూడాలి. సుధీర్‌ వర్మ ప్రస్తుతం శర్వానంద్‌తో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ చిత్రం పూర్తి అయిన తర్వాత ‘విక్రమ్‌ వేధా’ చిత్రం రీమేక్‌ రైట్స్‌ పనులు మొదలు పెడతాడేమో.

Tags:    

Similar News