ప‌వ‌న్ వీర ఫ్యాన్‌...వేరే పార్టీ నుంచి పోటీచేస్తోంది

Update: 2019-03-18 11:05 GMT
సినీన‌టి మాధ‌విలత‌ గుర్తుంది క‌దా? `నచ్చావులే`’ చిత్రంతో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత మూడు నాలుగు సినిమాల్లో నటించింది. అయితే కెరీర్ పరంగా పెద్దగా సక్సెస్ దక్కకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. దీంతో తెలుగు సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో తెరపైకి వచ్చి.. పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఫిల్మ్ ఛాంబర్ వద్ద మౌనదీక్షతో వార్తల్లోకి వచ్చింది. అప్పటి నుండీ క్రమం తప్పకుండా ఫేస్ బుక్‌ ద్వారా రకరకాల కామెంట్స్ చేస్తూ పవన్ ఫ్యాన్స్‌కి దగ్గరయ్యే ముమ్మర ప్రయత్నాలు చేసిందిమాధవీ లత. తాజాగా మ‌రో రీతిలో ఆమె తెర‌మీద‌కు ఎక్కింది. బీజేపీ త‌ర‌ఫున ఆమె బ‌రిలో దిగుతోంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పై - టాలీవుడ్ క్యాస్టింగ్ విధానంపై ఘాటు వ్యాఖ్యలు చేసి మాధ‌విల‌త‌ అందరిని ఆకర్షించింది.  ఆ తరువాత బీజేపీలో చేరింది. తాజాగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఆమెకు గుంటూరు పశ్చిమ టికెట్ ను కేటాయించారు. రాజకీయాలకు కేంద్రబిందువైన గుంటూరులో ముఖ్యంగా గుంటూరు వెస్ట్ నియోజక వర్గంలో ఈసారి పోటీ రసవత్తరంగా ఉండేవిధంగా కనిపిస్తోంది.  అన్నిపార్టీలు ఈ నియోజక వర్గంపైనే దృష్టి సారించి ప్రచారం చేస్తున్న త‌రునంలో మాధవిల‌తకు టికెట్ కేటాయించ‌డం గ‌మ‌నార్హం.

కాగా, ఓ సంద‌ర్భంలో మాధ‌విల‌త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ ప‌ట్ల త‌న‌కు ఉన్న ఫీలింగ్‌ ను వెల్ల‌డిస్తూ `` పవన్ కళ్యాణ్ నాలుగో వైఫ్‌ ని అని - ఇదే పనా పవన్‌ కి.. ఆయన్ని నాకంటే ప్రేమించే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇలా అని ఆయన పరువు తీయొద్దు.. మీరు మీ పిచ్చిమాటలు. పవన్‌ పై నాకున్న ప్రేమ ఫలితం ఆశించనిది. నా అభిప్రాయంలో నా లైఫ్‌లో పవన్ తప్ప ఇంకొకరు రారు లేరు అని కాదు. అది హృదయానికి సంబంధించిన ప్రేమ. నాకు షాపింగ్ అంటే ఇష్టం.. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం.. అలాగే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఈ మూడు నా లైఫ్‌ లో మారవు. కాశీలో వదిలేయమన్నా.. వదిలేయను’ అంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పేసింది.


Tags:    

Similar News