అమెరికాలో ఈవెంట్ల పేరుతో ఎన్నారై దంపతులు కిషన్ - చంద్రకళలు నడుపుతోన్న సెక్స్ రాకెట్ గుట్టు రట్టయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో టాలీవుడ్ - కోలీవుడ్ - శాండల్ వుడ్ కు చెందిన పలువురు హీరోయిన్లు ఉన్నారని వార్తలు వెలువడుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో తమను బెదిరించి - పాస్ పోర్టు - వీసాలు లాక్కొని వ్యభిచారం చేయించారని కొందరు హీరోయిన్లు..ఫెడరల్ ఏజెన్సీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చిన విషయం విదితమే. తాజాగా, ఈ వ్యవహారంపై టాలీవుడ్ నటి మాధవీలత స్పందించారు. గత ఏడాది ఓ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లిన సందర్భంలో తనను కూడా ఆ దంపతులు ట్రాప్ చేయాలని చూశారని మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే, తాను చాకచక్యంగా వ్యవహరించి వారి బారి నుంచి ఎలాగోలా బయటపడ్డానని తెలిపింది. ఆ పర్యటనలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
గత ఏడాది ఓ ఈవెంట్ కోసం తాను అమెరికా వెళ్లానని, ఆ ఈవెంట్ కోఆర్డినేటర్లుగా కిషన్ - చంద్రకళ ఉన్నారని తెలిపింది. అయితే, అక్కడ జరుగుతున్న పరిణామాలు చూసి తనకు అనుమానం వచ్చిందని, అందుకే తాను అప్రమత్తమయ్యానని చెప్పింది. తన పాస్ పోర్ట్ కూడా పరుపు కింద దాచిపెట్టి పడుకున్నానని ఆనాటి ఘటనలను గుర్తు చేసుకుంది. తాను అమెరికాలో 20 రోజులు గడిపానని - అయితే, తాను వారి బండారం బయటపెడతానేమోనని తనను దాదాపుగా హౌస్ అరెస్ట్ చేశారని చెప్పింది. తనకు తీవ్రమైన మెడనొప్పి వచ్చినా....చికిత్స చేయించకుండా పట్టించుకోకపోగా - ఇండియాకు వెళ్లి చేయించుకోవాలని కిషన్ సలహా ఇచ్చారని తెలిపింది. వారం రోజుల పాటు మందులు వాడి ఇండియాకు వచ్చి చికిత్స చేయించుకున్నానని చెప్పింది. ఆ తర్వాత అటువంటి ఈవెంట్స్ కు వెళ్లకూడదని డిసైడ్ అయ్యానని చెప్పింది.
చికాగో సెక్స్ రాకెట్ లో చిక్కుకున్న హీరోయిన్లదే తప్పని - వారికి తెలిసే డబ్బుకోసం వ్యభిచారం చేసేందుకు వెళుతున్నారని అనడం సరికాదని మాధవీలత తెలిపింది. మీడియాలో హీరోయిన్ల గురించి తప్పుగా మాట్లాడుతున్న వారికి ఒంటరిగా అమ్మాయి దొరికితే వెకిలి వేషాలు వేస్తారని మండిపడింది. ఈవెంట్స్ కోసం వెళ్లిన హీరోయిన్లు - అమ్మాయిలను ఓ రకమైన ట్రాప్ వేసి అమెరికాకు పిలిపిస్తారని చెప్పింది. ఆ తర్వాత వారి పాస్ పోర్ట్ ను కిషన్ లాగేసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పింది. దాంతో, తాను అమెరికా ఈవెంట్ సమయంలో పరుపుకింద పాస్ పోర్టు దాచుకునేదాన్ని తెలిపింది. అమెరికాలో ఆ తరహా ఈవెంట్లకు వెళ్లి ఇబ్బంది పడ్డవారు దాని గురించి మాట్లాడేందుకు భయపడుతున్నారని - అందుకే తమకు ఇలాంటి అనుభవం ఎదురుకాలేదని తప్పించుకు తిరుగుతున్నారని మాధవీలత చెప్పింది.