అచ్చ తెలుగు అమ్మాయ్ మాధవిలత. నచ్చావులే హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత పెద్దగా అవకాశాల్ని చేజిక్కించుకోలేకపోయింది. అయినా.. నిరాశ చెందని వైనం ఆమెలో కనిపిస్తుంటుంది. అవకాశాల కోసం కమిట్ అయ్యేందుకు ససేమిరా అనటమే ఆమెకు అవకాశాల్లేకుండా చేసిందన్న టాక్ వినిపిస్తుంటుంది. ప్రశ్న ఏదైనా.. బోల్డ్ గా.. ముక్కుసూటిగా మాట్లాడే తత్త్వం ఆమె సొంతం. మాటలే కాదు.. తీరు కూడా అంతే స్టైయిట్ ఫార్వర్డ్ గా ఉంటుందన్న మాట ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనంగా మారింది.
ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పటేమే కాదు.. హీరోయిన్ల వద్దకు ఎలా అప్రోచ్ అవుతారన్న విషయాన్ని వెల్లడించింది. తనను చాలామంది అప్రోచ్ అయ్యారని చెప్పిన ఆమె..టాప్ ప్రొడ్యూసర్లు.. డైరెక్టర్లు కూడా తనతో.. ‘‘మనం క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉండలేమా?’’ అని అంటూ ఉంటారని.. ఆ మాటకు అర్థం ఏమిటన్న విషయాన్ని చెప్పేసింది.
తాను పాజిటివ్ గా రియాక్ట్ కాకపోవటంతో షూటింగ్ లో తనను వేధింపులకు గురి చేసేవారని.. చెట్ల కింద మేకప్ వేయించటం.. హోటల్ రూం మార్చేయటం.. అందరి ముందు ఛండాలంగా తిట్టేయటం.. బండబూతులు తిట్టటం లాంటివి చేస్తుంటారని వెల్లడించింది. కో-ఆపరేట్ చేయకపోతే బతకలేం మాధవీలత అని చెప్పినోళ్లు చాలామందే ఉన్నారని.. టాలెంట్ ఎవడికి అక్కర్లేదంటూ కుండ బద్ధలు కొట్టేసింది.
తనను ప్రేమించిన వ్యక్తి గురించి వెల్లడించిన ఆమె.. తన కోసం నెల రోజులు తన ఇంటి ఎదుటే నిలబడేవాడని.. తనను మర్చిపొమ్మని చెప్పినా వెళ్లే వాడు కాదని.. తానే కరకుగా మాట్లాడి లోపలకు వచ్చి ఏడ్చేదానినని వెల్లడించింది. తనజీవితంలో మర్చిపోలేని అతి భయంకరమైన విషయం.. ఒక ప్రముఖుడు తనను విపరీతంగా హెరాస్ చేశాడని..కాకుంటే ఒక్క దురుసు మాట మాట్లాడడని.. వార్నింగ్ ఇవ్వడు.. తడిగుడ్డతో గొంతులు కోస్తారంటారే.. అలా అన్న మాట. ‘‘నీ ముఖం మీద యాసిడ్ పోసేస్తానే’’ అనేశాడు. ‘‘అక్కడెక్కడో కూర్చొని చెప్పటం కాదు.. నేను అమీర్ పేటలో ఉన్నా.. అడ్రస్ ఇదివచ్చి పోసేసి వెళ్లిపో’ అని అన్నా. ‘‘ఓహో.. గొంతులేస్తుందా? నువ్వు వార్నింగ్ లు ఇస్తే భయపడటం లేదిక్కడ. నిన్ను ఇలా కాదు.. నీ వీక్ నెస్ మీద కొడతా. ఫోన్ పెట్టేయ్’’ అన్నాడు.
వారం రోజుల పాటు నా వీక్ నెస్ ఏమిటా అని తెగ ఆలోచించా..వారం తర్వాత ఫోన్ వచ్చింది.. ఆ రోజు మా నాన్నఎంతలా ఏడార్చంటే.. అంతగా ఏడ్చారు. ఊహించనంత పెద్ద సమస్య వచ్చింది.. నాకైతే ఏమనిపించిందంటే.. నాకేమైనా ఫర్లేదు. వాడ్నిచంపేద్దామని అనుకున్నా’’ అని చెప్పారు. నేను బాగున్నానని ఒక్క మగాడ్ని చెప్పమను.. మూసి ఉంచినంతసేపే పుస్తకం. ఒక్కసారి నోరు విప్పితే.. ఎంతో మంది కాపురాలు కూలిపోతాయంటూ చెప్పిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/