స‌మంత సాంగ్ పై మాధ‌వీల‌త రియాక్ష‌న్‌

Update: 2021-12-15 17:30 GMT
అల్లు అర్జున్ న‌టిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ `పుష్ప‌`. ఈ మూవీ రిలీజ్ కు ముందే వ‌రుస వివాదాల‌తో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కార‌ణంగా వార్త‌ల్లో నిలిచిన ఈ మూవీ తాజాగా స‌మంత ఐట‌మ్ సాంగ్ తో మ‌రోసారి వివాదంలో ఇరుక్కుంది. ఇప్ప‌టికే విడుద‌లైన సాంగ్ వీడియోలు, టీజ‌ర్ , ట్రైల‌ర్ ల‌తో సంచ‌ల‌నం సృష్టించి భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంది. అయితే తాజాగా స‌మంత ఐట‌మ్ సాంగ్ కార‌ణంగా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.

`ఊ అంటావా మామ.. ఊహూ అంటావా ..  అంటూ ఇప్పటికే విడుద‌లైన సామ్ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. అదే స్థాయిలో వివాదాల‌కు కేరాఫ అడ్ర‌స్ గా మారుతోంది. ఫోక్ సింగ‌ర్ ఇంద్రావ‌తి చౌహాన్ మ‌త్తు మత్తుగా పాడిన ఈ పాట‌కు చంద్ర‌బోస్ సాహిత్యాన్ని అందించారు. ఈ పాట‌లో బ‌న్నీతో క‌లిసి స‌మంత వేసిన ల్యాప్ స్టెప్‌.. పాట‌లోని ప‌దాలు పురుషుల్ని కించ‌ప‌రిచేవిగా వున్నాయ‌ని ఆగ్ర‌హించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ పురుష సంఘం ఏపీ కోర్టుని ఆశ్ర‌యించింది. చిత్ర యూనిట్ తో పాటు పాట‌లో న‌టించిన స‌మంత‌పై కూడా కేసు పెట్టింది.

ఇదిలా వుంటే స‌మంత ఐటమ్ సాంగ్ పై న‌టి మాధ‌వీల‌త సోష‌ల్ మీడియా ఫేస్‌బుక్ వేదిక‌గా సంచ‌ల‌న కామెంట్ లు చేసింది. `వామ్మో `పుష్ప‌` మూవీ సాంగ్ మీద కేసంట‌గా.. ఈ లెక్క‌న ఇండ‌స్ట్రీలోని 90 శాతం సాంగ్స్ ఇలాగే వుంటాయి. అయితే ఇక నుంచి సాంగ్స్ లేని సినిమాలు తీయాలి. అయితే నేను కూడా అమ్మాయిల‌మీద రాసే పాట‌ల‌కి కేసులు పెడ‌తా అని కామెంట్ చేసింది. `రారా సామి..` సాంగ్ మీద స్పందిస్తూ `ఏంటీ ఒక‌మ్మాయికి మ‌గాడిని చూస్తే.. అత‌ను పోలిస్తే అంత చుల‌క‌న‌గా వెంట‌ప‌డి వెళ్లిపోద్దా? అని చుర‌క‌లంటించింది. ఒక మ‌హిళ ప‌రువు పోయింది నాకు న‌చ్చ‌లే.. ఛ నేనూ కేసు పెడ‌తా అంటూ వెట‌కారాలు పోయింది. మాధ‌వీల‌త చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Tags:    

Similar News