పెద్ద పెద్ద కళ్ళు అమాయకంగా చూసే చూపు పొలాల గట్టులలో ఆటలాడుతూ తిరిగే అమ్మాయి ‘చిన్ని చిన్ని ఆశ’ అంటూ ఒక కుర్రాడికి కనిపించింది. అక్కడే ఆమె అందానికి ముగ్ధుడైన ఆ అబ్బాయి పెళ్లిచేసుకొని తనతో కాశ్మీర్ కు పట్టుకు పోయి ‘పరువం వానగా' అంటూ ప్రేమ పాట పాడుకున్నాడు. అవును అప్పటి రోజు సినిమాలో ఆ చిలిపి ఆడపిల్లే ఇక్కడ ఉన్న సుందరీమణి.. ఒకనాటి పాత ఫోటో ఒకటి పోస్ట్ చేసి అభిమానులుకు మధుర అనుభూతులను మళ్ళీ గుర్తు చేసింది మధుబాల.
మహర్షి తపస్సు భంగపరచడానికి వచ్చిన మేనక లా ఉంది కదా ఇక్కడ ఈమె వాలకం చూస్తే. మణిరత్నం సినిమాలలో కనిపించే హీరోయిన్ లా ఉంది అనుకుంటున్నారా, అలా ఉంది కాబట్టే మధుబాల వరుసగా రెండు మణిరత్నం హిట్ సినిమాలలో నటించింది. మోహన్ లాల్ ప్రకాష్ రాజ్ నటించిన ఇద్దరు సినిమాలో శశివదనే పాట తెలుసా? ఆ పాట లోని సోయగమే ఇదంతా. అప్పటిలో అలా ఉండేదాన్ని అని చెప్పడానికి ఇప్పుడు ఇలా పోస్ట్ చేసిందా లేక ఇప్పుడు ఇలానే ఉన్నాను అని చెప్పడానికి పోస్ట్ చేసిందో కానీ ఆమె అభిమానులు మాత్రం చూసి తెగ సంబరపడిపోతున్నారు.
మధుబాల ఇప్పుడు మళ్ళీ సినిమాలలో నటించడానికి సిద్దమైంది. ఇప్పటికే ఒక మలయాళం సినిమాలో నటిస్తుంది కూడాను. వెండి వస్త్రాలు చుట్టి చందనపు బొట్టు పెట్టి ముస్తాబు అయిన దేవ కన్య లా కనిపిస్తున్న ఈమె ఇప్పటికి కూడా అప్పటి రూపంలో ఉండటం ఒకరకంగా ప్లసే కానీ ఈమెను ఏ పాత్రలో తీసుకోవాలో మాత్రం తెలియక తికమక పడుతున్నారు సినిమా జనాలు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/