ఈ మధుబాల ఏడుపు ఏంటి గురూ!!

Update: 2016-10-19 22:30 GMT
''ఇది కన్ఫామ్. నేను చిన్న చిన్న హీరోలకు తల్లిగా పనికిరాను. ఎందుకంటే చాలా గ్లామరస్ గా ఉన్నాను కాబట్టి. అలాగే పెద్ద పెద్ద హీరోలకు ప్రియురాలిగా కూడా పనికిరాను. 20 నుండి 80 ఏళ్ల వయస్సున్న ఏ హీరో ప్రక్కనా సెట్టవ్వను. ఎందుకంటే నా వయస్సు 40 దాటింది కాబట్టి. అంతే'' అంటూ సడన్ గా తన బాధను ఒక స్టేట్మెంట్ తో వెళ్ళగక్కింది హీరోయిన్ మధుబాలు ఎలియాస్ మధు.

అవును. సౌత్ ఇండియాలో ఇప్పుడిప్పుడే గ్లామరస్ ఆంటీలను అత్తయ్య అండ్ అమ్మ క్యారక్టర్లకు దించుతున్నారు. నదియా వంటి భామలు ఆ ట్రెండ్ ను తీసుకొచ్చారు. అయితే మధుబాల మాత్రం.. ఇంకా రోజా సినిమా హీరోయిన్ లా.. జెంటిల్మన్ సినిమా ప్రియురాలిలా ఉండటంతో.. ఆమెను తల్లి రోల్స్ కు రెండు మూడు సార్లు ప్రయత్నించినా కూడా.. మనోళ్ళ దగ్గర నుండి రెస్సాన్స్ సరిగ్గా రాలేదు. అంతకుముందు ఆ తరువాత - సూర్య వర్సెస్ సూర్య వంటి సినిమాల్లో మధుబాల బాగానే అలరించినా కూడా.. ఆమె మరీ యంగ్ గా కనిపిస్తోంది కాబట్టి.. మనోళ్ళు అమె చేసిన అమ్మ పాత్రలకు కనక్ట్ అవ్వలేకపోయారు. ఇక హీరోయిన్ ఛాన్స్ అంటారా? మన ఇండియన్స్ మైండ్ సెట్టే వేరు. హాలీవుడ్ తరహాలో 40 ఏళ్ల ఆంటీలను (ఒక్క ఐష్‌ తప్పించి) ఇక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు.

ఇకపోతే ఇదే విషయాన్ని ఇప్పుడు ఎవరో అమ్మడి ఫేస్ మీదనే చెప్పేసినట్లున్నారు. అందుకే అమ్మడు తెగ బాధపడుతోంది. కాని ఇలా ఏడిస్తే ఛాన్సులు వస్తాయా మధూ.. మరోసారి ఏమన్నామెయిన్ లీడ్ పాత్రలు వస్తాయేమో చూడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News