90ల్లో బాలీవుడ్ సినిమాను ఏలిన హీరోయిన్లలో మాధురీ దీక్షిత్ ఒకరు. అందం.. అభినయంతో పాటు అద్భుతమైన నృత్య ప్రతిభ కూడా ఆమె సొంతం. ఆమె డ్యాన్సింగ్ నంబర్స్ చూస్తే ఈ తరం ప్రేక్షకులకు కూడా ఊపొచ్చేస్తుంది. మాధురి కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ పాటల్లో ‘తానేదార్’లోని ‘తమ్మా తమ్మా ఒకటి. ఈ పాటను ఇప్పుడు బాలీవుడ్ లేటెస్ట్ మూవీ ‘బద్రీనాథ్ కీ దుల్హానియా’ కోసం రీమేక్ చేస్తున్నాడు దర్శకుడు శశాంక్ ఖేతాన్. వరుణ్ ధావన్.. ఆలియా భట్ ల మీద ఈ పాట చిత్రీకరిస్తున్నారు. విశేషం ఏంటంటే వాళ్లిద్దరికీ స్వయంగా మాధురీ దీక్షితే స్టెప్పులు నేర్పించింది.
మాధురి తమ ఇద్దరికీ తమ్మా తమ్మా పాట కోసం స్టెప్పులు నేర్పిస్తున్న వీడియోను ఆలియా ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ వీడియోలో ముందుగా ఆలియా.. వరుణ్ డ్యాన్స్ చేస్తుంటే మధ్యలో మాధురి వచ్చి జాయిన్ అవుతుంది. స్టెప్స్ ఎలా వేయాలో చూపిస్తుంది. ‘‘తమ్మా స్టెప్ ఎలా వేయాలి? మమ్మల్ని రక్షించినందుకు మాధురి దీక్షిత్కు థ్యాంక్స్. వరుణ్ ధావన్ తమ్మా తమ్మా స్టెప్ మళ్లీ వేద్దామా’’ అని ట్విట్టర్లో స్పందించింది మాధురి. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ తర్వాత వరుణ్ ధావన్-ఆలియా భట్ జంటగా నటించిన సినిమా ‘బద్రీనాథ్ కీ దుల్హానియా’. కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 10న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.