సరదాగా కాసేపు.. అంటూ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన మధురిమ ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో కనిపించడం లేదెందుకో. అప్పట్లో మారుతి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించినా ఆశించినంత హిట్ కొట్టలేకపోయింది. ఆ తర్వాత ఇక పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు తమిళ్, కన్నడ పరిశ్రమలపై దృష్టి సారించింది అమ్మడు. అక్కడ లేటెస్టుగా ఓ క్రేజీ ప్రాజెక్టు లో నటించే అవకాశాన్ని అందుకుంది. శాండాల్వుడ్ లో రణ్ణ సినిమాతో హిట్ కొట్టిన నందకిషోర్ దర్శకత్వంలో ఈ భామ కథానాయికగా నటించనుంది. 70రోజుల కంటిన్యువస్ షెడ్యూల్ తెరకెక్కించనున్నారు.
అందం, అభినయం, ఒడ్డు పొడవు ఉన్నా మధురిమ ఎందుకో టాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయింది. కోలమొహం చిన్నదిగా ఆకట్టుకున్నా ఫేట్ వేరొక విధంగా నిర్ణయించి ఉంది. ఏదేమైనా అడపాదడపా అన్ని పరిశ్రమల్లో అవకాశాలు అందుకుంటూ నటనలోనే కొనసాగుతోంది. ఎవ్రీ డాగ్ హాజ్ ఏ డే (ప్రతి కుక్కకి ఓ రోజొస్తుంది) అలాంటి ఓ రోజు కోసం ఎదురు చూస్తోంది. 30ఏళ్లుగా సినీపరిశ్రమలోనే కొనసాగుతూ సరైన అవకాశం రాక ఆత్మన్యూనతో బతికేవారెందరో. అలాంటి వాళ్లతో పోలిస్తే మధురిమ కెరీర్ బెటర్ గానే ఉందని చెప్పొచ్చు. త్రిష, ఇలియానా, నయనతార రేంజుకి ఎదగలేకపోయినా తన రేంజులో బండి నడిపించేస్తోంది. ఆల్ ది బెస్ట్ మధూ.