ఈ ఏడాది విడుదలైన చిన్న సినిమాల్లో సిద్దూ జొన్నల గడ్డ నటించిన `డీజే టిల్లు` రికార్డు స్థాయి విజయాన్ని సాధించి ట్రేడ్ వర్గాలనే విస్మయానికి గురిచేసింది. తక్కువ బడ్జెట్ తో ఎలాంటి అంచనాలు లేకుండా భారీ సినిమాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని సాధించి 50 కోట్ల క్లబ్ లో చేరింది. దీంతో ఈ మూవీలో నటించిన హీరో సిద్దే జొన్నలగడ్డకు హీరోగా భారీ క్రేజ్ ఏర్పడింది.
ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీకి సీక్వెల్ ని ప్లాన్ చేశారు. ఫస్ట్ పార్ట్ లోనే ఎండింగ్ లో సీక్వెల్ కి లీడ్ ఇచ్చేసిన చిత్ర బృందం అన్నట్టుగానే `టిల్లు స్వ్కేర్` అంటూ సీక్వెల్ కు శ్రీకారం చుట్టింది. సినిమా పట్టాలెక్కకుండానే సీక్వెల్ చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. దర్శకుడు మారాడు. అతని స్థానంలో మల్లిక్ రామ్ వచ్చి చేరాడు. తనతో పాటు హీరోయిన్ నేహా శెట్టి కూడా మారిపోయింది. తన స్థానంలో అనుపమా పరమేశ్వరన్ ని హీరోయిన్ గా తీసుకున్నారు.
అంతా ఫైనల్ ఇక సెట్ లోకి వెళుతున్నాం అంటూ చిత్ర బృందం ఓ వీడియోని కూడా విడుదల చేసి సీక్వెల్ పై హైప్ ని క్రియేట్ చేసింది. షూటింగ్ మొదలైందో లేదో అప్పుడే ఈ మూవీ నుంచి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఔట్ అనే వార్తలు మొదలయ్యాయి. సెట్ లో ఇద్దరి మధ్య చిన్న చిన్న విషయాల్లో తగాదాలు జరుగుతున్నాయని, అది నచ్చకే అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ నుంచి తప్పుకుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది.
కట్ చేస్తే అనుపమ పరమేశ్వరన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో తన స్థానంలో `ప్రేమమ్` బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ ని తీసుకున్నారట. ఈ వార్త వైరల్ అవుతుండగానే హీరో సిద్దూ జొన్నలగడ్డ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా మీకు మంచి సినిమా ఇవ్వబోతున్నానని, ఈ మూవీపై వస్తున్న రూమర్ లపై త్వరలో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడిస్తానని చెప్పుకొచ్చాడు. ఇంత జరుగుతున్నా అనుపమ స్పందించడం లేదేంటని అంతా ఆరా తీయడం మొదలు పెట్టారు.
ఫైనల్ గా అనుపమ పరమేశ్వరన్ కూడా స్పందించింది. `టిల్లు 2` నుంచి తాను తప్పుకున్నానని తెలివిగా వెల్లడించింది. నిష్క్రమణ.. ప్రవేశం.. మరో చోట చేరికకే` అంటూ ఏడాది క్రితం పంచుకున్న ఓ ఫొటోని అభిమానులతో పంచుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. అనుపమ `టిల్లు 2` వివాదంపై స్పందించిన తీరుని గమనించిన వారంతా అనుపమ భలే స్మార్ట్ గా స్పందించిందే అంటూ కామెంట్ లు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.