'రాంచరణ్'ను స్టార్ హీరో చేసిన మగధీరకి 11యేళ్లు!

Update: 2020-07-31 16:37 GMT
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు రాంచరణ్ తేజ్. ఫస్ట్ సినిమాతోనే డాన్స్.. ఫైట్లలో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. అదే టైంలో రాజమౌళితో సినిమాని అనౌన్స్ చేశారు మెగాస్టార్. ముందుగా చరణ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ రాజమౌళికే వచ్చింది. అయితే ఫస్ట్ సినిమా అయితే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి కాబట్టి సెకండ్ సినిమా చేస్తానని మాటిచ్చాడట. అలా చరణ్, రాజమౌళి కాంబోలో మగధీర సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను భారీ అంచనాల మధ్య 2009 జులై 31న విడుదలైంది. అయితే ఈ సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. నేటికి మగధీర సినిమాకి 11ఏళ్ళు. మగధీర సినిమాతోనే రాంచరణ్ స్టార్ హీరో అయిపోయాడు. మగధీరకి 11యేళ్లు కంప్లీట్ అయినందుకు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఈ సందర్భంగా రాంచరణ్ రాజమౌళిని ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. "నాకు మార్గదర్శకంగా నిలిచిన అద్భుతమైన అనుభవం అది. నాలోని ప్రతిభకు గొప్ప పరీక్షగా నిలిచింది. `మగధీర` చిత్రబృందం, అభిమానులు, ప్రేక్షకులు నా మీద చూపిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. రాజమౌళి గారూ.. నాలోని స్ఫూర్తిని నింపి ముందుకు నడిపించారు. కష్టపడితే ఫలితం ఉంటుందని నాకు తెలిపారని చెర్రీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం రాంచరణ్ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ సినిమా కథారచయిత కె.వి.విజయేంద్ర ప్రసాద్ ఓ మరాఠీ చిత్రం ఆధారంగా చేసుకొని ఈ సినిమాని రూపొందించారు. ఈ కథను విజయేంద్ర ప్రసాద్ 15 ఏళ్ల క్రితమే రాసి పెట్టుకున్నాడట. చరణ్ తో సినిమా కోసం రాజమౌళి ఈ కథను ఎంచుకున్నాడు. కన్నడ చిత్రం 'రాజా నన్నా రాజా' చిత్రం నుంచి కూడా ఈ సినిమా రూపొందించడానికి ప్రేరణ పొందినట్లు సమాచారం.
Full View
Tags:    

Similar News