మెహబూబాకి ముందే టెన్షన్.. ఇప్పుడింకా..

Update: 2018-05-10 10:30 GMT
మెహబూబా అంటూ దర్శకుడు పూరీ జగన్నాధ్.. తన కొడుకు ఆకాష్ నే హీరోగా పెట్టి సినిమా చేశాడు. మరికొన్ని గంటల్లోనే ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. కొన్ని నెలలక్రితమే కంప్లీట్ అయిన ఈ చిత్రాన్ని.. సరైన రిలీజ్ డేట్ కోసం అని చెప్పి.. ఇన్నాళ్లు ఆపి మే 11కు ఫిక్స్ అయ్యారు.

కానీ ఈ డేట్ కూడా అంతగా కలిసొచ్చేట్లుగా కనిపించడం లేదు. అన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అయిపోయాక విడుదల తేదీ ఫిక్స్ చేసుకున్నారు. మహానటి సంగతి అప్పటికే తెలిసినా.. ఆ మూవీ తన మెహబూబాపై ఎఫెక్ట్ చూపించేంతటి సక్సెస్ అవుతుందని బహుశా పూరీ ఊహించి ఉండడు. నిజంగానే మహానటి అలాంటి అద్భుతాలే చేస్తోంది. వారం మధ్యలో రిలీజ్ అయినా.. యూఎస్ ప్రీమియర్ల ద్వారానే 3 లక్షల డాలర్ల వసూళ్లు అంటే.. ఓ రేంజ్ ఉన్న స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే ఫీట్ ఇది. ఇప్పుడొచ్చిన యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ కారణంగా.. వీకెండ్ వచ్చేసరికి మరింతగా స్క్రీన్స్.. షోస్ పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇది నేరుగా మెహబూబాపై ప్రభావం చూపుతోంది. మరోవైపు అడియన్స్ కి కూడా ఫస్ట్ ఛాయిస్ గా మహానటి నిలుస్తోంది తప్ప.. మెహబూబాను యూఎస్ లో అసలు పట్టించుకునే పరిస్థితే  లేదు. అమెరికాలో మెహబూబాను రిలీజ్ చేసిన బయ్యర్స్.. ప్రమోషన్స్ విషయంలో పాటిస్తున్న అలసత్వం కూడా సినిమా రిజల్ట్ ను ఎఫెక్ట్ చేసేలానే ఉంది.
Tags:    

Similar News