ఇప్పుడు ఒక గొప్ప సినిమా వచ్చిందనుకోండి.. దాని గురించి ట్విట్టర్ ఫేస్ బుక్ వంటి సోషల్ మాద్యమాలలో రచ్చ చేయడం ఒక పద్దతి. అయితే అసలు ఎవరూ ఊహించలేనంత గొప్ప సినిమా తీస్తే సీన్ ఎలా ఉంటుంది? అలాంటి డౌంట్ వస్తే మాత్రం.. మహానటి సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది సినిమా దిగ్గజాలు పోటీ పడి మరీ ఈ సినిమాకు పార్టీలు ఇస్తున్నారు.
ముందుగా 'మహానటి' సినిమా అత్యధ్బుతం అంటూ ఆ టీమ్ ను పిలిపించి కొనియాడారు. అసలు మా చిరంజీవి బాస్ పిలిపించి సినిమా గురించి మాట్లాడటమంటే మా పిల్లలు సక్సెస్ అయిపోయినట్లే అంటూ అశ్వినీదత్ స్వయంగా కామెంట్ చేశారు. ఆ తరువాత అల్లు అరవింద్ అండ్ అల్లు అర్జున్ లు కలసి.. మహానటికి ఒక పార్టీ ఇచ్చారు. ఏకంగా రాజమౌళి కూడా అక్కడకు విచ్చేసి సినిమాను ఆకాశానికి ఎత్తేశాడు. ఇప్పుడు కొణిదెలాస్ అండ్ అల్లూస్ బ్యాటింగ్ అయిపోవడంతో.. మంచూస్ కూడా తమ వంతుగా సినిమాను తీసిన దర్శకుడు మరియు నిర్మాతలను సత్కరించారు. ఇంటికి పిలిచి శాలువా కప్పారు.
చూస్తుంటే రాబోయే రోజుల్లో ఫిలిం ఛాంబర్.. ప్రొడ్యూసర్ కౌన్సిల్.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా 'మహానటి' టీమ్ ను పిలిచి సత్కరించినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. అయినా సినిమాను అంత గొప్పగా ఆవిష్కరించినప్పుడు ఆ రేంజులో సత్కరించడంలో తప్పులేదు. కాకపోతే నంది అవార్డులు వంటివి ఇచ్చేటప్పుడు మాత్రం.. మా గ్యాంగు మా వీధి అని చూసుకోకుండా అప్పుడు కూడా ఇదే రేంజులో వీరికి ట్రోఫీలు ఇచ్చి ఉత్తేజపరిస్తే బాగుంటుంది.