దుబాయ్ EXPO-2020లో 'మ‌హ‌ర్షి' ప్ర‌ద‌ర్శ‌న‌

Update: 2022-03-27 06:35 GMT
సూపర్ స్టార్ మహేష్ జాతీయ అవార్డు విక్ట‌రీ చిత్రం మహర్షి దుబాయ్ ఎక్స్ పో 2020లో మెరిసింది. అక్క‌డ‌ ఇండియా పెవిలియన్ స్క్రీనింగ్ విభాగంలో ప్ర‌ద‌ర్శించ‌డం హైలైట్ గా నిలిచింది. ఇండియా పెవిలియన్ - మీడియా & ఎంటర్ టైన్ మెంట్ ఫోర్త్ నైట్ సందర్భంగా ఎక్స్‌పో 2020 లోని పెవిలియన్ లో మహర్షి ప్రదర్శన అహూతుల్ని రంజింప‌జేసింది.

వారాంతపు వ్యవసాయం అనే అరుదైన కాన్సెప్టుతో రూపొందిన చిత్ర‌మిది.  ఇందులో మహేష్ బాబు డబుల్ షేడ్స్ ఉన్న పాత్రలో న‌టించి మ‌న్న‌న‌లు అందుకున్నారు. ఇక కొత్త త‌ర‌హా వ్య‌వ‌సాయ విధానం అనే భావన సామాన్య ప్రజల జీవితాలపై బలమైన ప్రభావాన్ని చూపింది. వారాంతంలో వ్యవసాయం చేయడానికి ప్ర‌జ‌ల్లో చాలా మందికి స్ఫూర్తినిచ్చింది.

కమర్షియల్ బ్లాక్ బస్టర్ మహర్షి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు.. రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా.. సంపూర్ణ వినోదం .. ఉత్తమ కొరియోగ్రఫీ విభాగాలలో ఈ అవార్డులు ద‌క్కాయి.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - వైజయంతీ మూవీస్- పివిపి సినిమాస్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. దేవి శ్రీ ప్రసాద్ సౌండ్ ట్రాక్ లను అందించారు. పాట‌లు ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఇందులో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించగా అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర‌ను పోషించారు.
Tags:    

Similar News