మ‌హేష్ అంత దుర‌దృష్ట‌వంతుడు మ‌రొక‌రుండ‌రు!

Update: 2022-01-09 07:30 GMT
సూప‌ర్  స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు..మ‌హేష్ సోద‌రుడు ర‌మేష్ బాబు హ‌ఠాన్మ‌ర‌ణంతో ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబం శోక‌సంద్రంలో మునిగిపోయింది. ర‌మేష్ అకాల మ‌ర‌ణం ఆ కుటుంబానికి తీర‌ని లోటు. ఇక మ‌హేష్-ర‌మేష్ బాబుల బాండింగ్ గురించి అయితే చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రు క‌లిసి చాలా సినిమాల్లో న‌టించారు. రియ‌ల్ లైఫ్ లోనే కాదు..రీల్ లైఫ్ లోను ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల పాత్ర‌ల్లో ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. ఇక వ్య‌క్తిగ‌తంగా అన్న‌య్య అంటే మ‌హేష్ కి తండ్రి స‌మానుడు. త‌న కెరీర్ ఎదుగుద‌ల‌లో ర‌మేష్ బాబు ఎంతో కీల‌క పాత్ర పోషించార‌ని మ‌హేష్ చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. మ‌హేష్ ఎదుగుతోన్న వ‌య‌సులో త‌న చ‌దువు అన్న‌య్య ద‌గ్గ‌రుండి చూసుకునేవారు.

మ‌హేష్ ప్ర‌తీ విష‌యంలోనూ ర‌మేష్ బాబు ఇన్వాల్వ్ మెంట్ ఉండేది. అందుకే అన్న‌య్య‌ని పెద్ద నిర్మాత‌ని చేయాల‌ని మ‌హేష్  సైతం క‌ల‌లు కనేవారు. మ‌హేష్ హీరోగా `అర్జున్`..`అతిధి` చిత్రాల్ని ర‌మేష్ బాబు నిర్మించారు. కానీ ఆ రెండు స‌రైన ఫ‌లితాలు సాధించ‌లేదు. అర్జున్ యావ‌రేజ్.. అతిధి బిగ్ ఫ్లాప్. అప్ప‌టి నుంచే  మ‌హేష్ అన్న‌య్యను పెద్ద నిర్మాత‌ని చేయాల‌ని  భావించేవారు. అయితే ర‌మేష్ బాబు సినిమాల‌పై అంత‌గా ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌డం కార‌ణంగా మ‌హేష్ అనుకున్న‌ది చేయ‌లేపోతున్నారు అని చాలా కాలంగా మీడియాలో వినిపిస్తోన్న వార్త‌. ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో మ‌హేష్ అన్న‌య్య గురించి మాట్లాడారు.

``అన్నయ్య త‌న‌తో సినిమా చేస్తానంటే వెంట‌నే డేట్లు కేటాయిస్తాన‌ని.. ర‌మేష్ అన్న‌య్య‌ నాతో సినిమా చేస్తానంటే నేను కాదంట‌నా?`` అని చెప్పుకొచ్చారు. అంత అభిమానం చూపించే త‌మ్ముడు మ‌హేష్ అన్న‌య్య‌ని క‌డ‌సారి చూపున‌కు నోచుకోలేని ప‌రిస్థితి ఉందిప్పుడు. మ‌హేష్ కి కోవిడ్ పాజిటివ్ రావ‌డంతో హోమ్ ఐసోలేష‌న్ లో ఉన్నారు. అంత్య‌క్రియుల‌కు కూడా హాజ‌ర‌య్యే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. ఆ ర‌కంగా మ‌హేష్  దుర‌దృష్ట‌వంతుడ‌నే చెప్పాలి. ఇక‌ ర‌మేష్ బాబు సినిమాల నుంచి త‌ప్పుకున్న త‌ర్వాత ఆయ‌న మీడియాలో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. మ‌హేష్ సినిమా ఈవెంట్ల‌కు కూడా హాజ‌రు కాలేదు. ఆయ‌న చివ‌రిసారిగా `అతిధి`..`అర్జున్` సినిమా ఫంక్ష‌న్ల‌లోనే క‌నిపించారు. దీంతో ర‌మేష్ బాబు ఫోటోలు ఇంటర్నెట్ లో దొర‌క‌డం క‌ష్టంగా మారింది. ఎంత వెతికినా ఆ సినిమా ఈవెంట్ స‌మ‌యంలో  ఉన్న పాత‌ ఫోటోలు త‌ప్ప కొత్త‌వి దొర‌క‌లేదు.  
Tags:    

Similar News