ఇప్పుడు అత్యధికంగా రూమర్లు పాలు అవుతున్న సినిమా ఏదన్నా ఉందా అంటే.. ఖచ్చితంగా అది ఎన్టీఆర్ బయోపిక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో కనిపించబోయే ప్రతీ రోల్ గురించీ.. పలానా నటి.. పలానా నటుడు అంటూ చాలా రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ జీవితంలో ఆయనతో కలసి పనిచేసిన కొందరు స్టార్ల ప్లేసులో ఎవరిని తీసుకుంటారా అనే సందేహం చాలామందికి ఉంది. అక్కడే ఇప్పుడు ఒక కొత్త రూమర్ తెరపైకి వచ్చింది.
ఈ సినిమాలో ఆల్రెడీ శ్రీదేవి పాత్రలో దీపికా పదుకొని నటిస్తుందని.. జయప్రద రోల్ ను తమన్నా చేస్తుందని గతంలో రూమర్లు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ హయాంలో టాప్ నటులుగా కొనసాగిన ఏఎన్నార్ అండ్ కృష్ణ పాత్రల గురించి కొన్ని కొత్త న్యూసులు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ''మహానటి'' సినిమాలో ఏఎన్నార్ పాత్రలో మెరిసిన నాగచైతన్యను.. ఇప్పుడు ఈ బయోపిక్ లో కూడా అదే పాత్రకు తీసుకుంటున్నారని మొన్ననే టాక్ వచ్చింది. ఇక ఫ్రెష్ గా వినిపిస్తున్న మాట ఏంటంటే.. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో కనిపించడానికి మహేష్ బాబును అడిగారట. ఆయన కూడా వెంటనే ఓకె అన్నారు అని టాక్ గట్టిగా వినిపిస్తోంది.
అసలు ఎన్టీఆర్ కు కృష్ణకు చాలా విరోధాలు ఉన్నాయి అనేది తెలిసిన విషయమే. ఎన్టీఆర్ తీద్దాం అనుకున్న అల్లూరి సీతరామరాజు సినిమాను కృష్ణ ముందుగానే తీసేయడంతో.. అప్పట్లో వారి మధ్యన చాలా కాలం కోల్డ్ వార్ నడిచింది. మరి ఇప్పుడు అవన్నీ పట్టించుకోకుండా మహేష్ బాబు ఈ సినిమా చేస్తే మాత్రం.. మరోసారి మహేష్ ను అభినందించాల్సిందే. ఇకపోతే ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో రానా దగ్గుబాటి.. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్య బాలన్ కనిపిస్తారని.. అఫీషియల్ గా కాకపోయిన సన్నిహితవర్గాలు కన్ఫామ్ చేసిన న్యూస్. అది సంగతి.