మ‌హేష్‌-ఎ‌న్టీఆర్ మెగా మ‌ల్టీస్టార‌ర్!!

Update: 2020-07-20 04:31 GMT
ప‌రిశ్ర‌మ‌లో కొన్ని క‌ల‌యిక‌లు ఎంతో సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేస్తాయి. అలాంటి ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన‌ కాంబినేష‌నే ఇది. ఫ్యాన్స్ ఎవ‌రూ ఊహించ‌ని ఎగ్జ‌యిటింగ్ కాంబినేష‌న్ ని సెట్ చేసేందుకు బాస్ అల్లు అర‌వింద్ చేస్తున్న ప్ర‌య‌త్నం హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌కీ ఆయ‌న చేస్తున్న ఆ ప్ర‌య‌త్నం ఏమిటి? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

మ‌ల్టీస్టార‌ర్ల ట్రెండ్ ప్ర‌స్తుతం టాలీవుడ్ లో పీక్స్ లో ఉంది. అగ్ర హీరోలు యువ‌హీరోల‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్లు చేస్తున్నారు. ఇక యువ‌హీరోలు ఒక‌రితో ఒక‌రు క‌లిసి సినిమాల్లో న‌టించేందుకు ఎలాంటి భేషజానికి పోవ‌డం లేదు. ఇదో స్నేహ‌పూర్వ‌క సృజ‌నాత్మ‌క ట్రెండ్ అనే చెప్పాలి. చాలా కాలం క్రితం మ‌హేష్- ఎన్టీఆర్ కాంబినేష‌న్ మూవీ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఆ ఇద్ద‌రినీ క‌లిపి సినిమా తీసేందుకు టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ ప్ర‌య‌త్నించార‌ని.. దీనికి అల్లు అర్జున్ నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించనున్నార‌ని గుస‌గుస‌లు వినిపించాయి. అయితే కొన్ని కార‌ణాలు వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ అప్ప‌ట్లో ప‌ట్టాలెక్క లేదు.

మ‌రోసారి ఈ కాంబినేష‌న్ పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మ‌హేశ్- ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో అల్లు అర‌వింద్ ఓ మెగా ప్రాజెక్ట్ కోసం ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈసారి బ‌న్ని ఈ ప్రాజెక్ట్ లో ఉండ‌టం లేదు. అటు మ‌హేష్‌ నుంచి ఇటు య‌న్టీఆర్ నుంచి ఈ సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్నెల్ వ‌చ్చింద‌ట‌. ఇండ‌స్ట్రీలో ఉన్న టాప్ రైట‌ర్స్ తో వీరిద్ద‌రి కాంబినేష‌న్ మూవీ కోసం ఓ స్టోరీ రెడీ చేయించ‌డానికి అల్లు అర‌వింద్ ప్లాన్ చేస్తున్నారు.
Tags:    

Similar News