మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వారు అమెరికాలో నిర్వహించిన ఫండ్ రైజింగ్ ఈవెంట్ లో అవకతవకలు జరిగాయని వార్తలు రావడం ఆ తర్వాత అది రెండు గ్రూపుల మధ్య వివాదంగా మారడం తెలిసిన విషయాలే. ఇలాంటి వివాదాలతో ఇండస్ట్రీ పరువు బజారున పడుతోందని ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ పెద్దలలో ఒక అభిప్రాయం ఏర్పడింది.
మా వారు నెక్స్ట్ ఏర్పాటు చేయబోయే ఫండ్ రైజింగ్ ఈవెంట్ లో మహేష్ బాబు పాల్గొనాల్సి ఉంది. ఈ ఈవెంట్స్ ద్వారా మా కు వచ్చే ఫండ్స్ తో అసోసియేషన్ బిల్డింగ్ కట్టాలని మా వారు భావిస్తున్నారు. దీంతో ఈ ఈవెంట్స్ సజావుగా జరగడం చాలా ముఖ్యం. ఈ వివాదాల కారణంగా మహేష్ బాబు ఈవెంట్ నుండి వైదొలగే ఆలోచనలో ఉన్నాడని ఇప్పటికే కూడా వచ్చాయి. దీంతో మహేష్ స్వయంగా చిరంజీవి కి ఫోన్ చేసి ఈవెంట్ లో తప్పనిసరిగా పాల్గొంటానని తెలిపాడట. ఈ వివాదం సద్దుమణిగిన తర్వాత ఈవెంట్ డేట్ ఫైనలైజ్ చేసినప్పుడు తనవైపునుండి సహకారం అందిస్తానని క్లారిటీ ఇచ్చాడట. బయట ఇంత వివాదం జరుగుతున్నా దాన్ని పట్టించుకోకుండా మహేష్ ఈవిధంగా సమస్య పరిష్కరం దిశగా చొరవ చూపడంతో చిరు మహేష్ ను ప్రశంసించారట.
మహేష్ వైపునుండి క్లారిటీ రావడంతో 'మా' వివాదాన్ని పరిష్కరించే దిశగా ఇరుపార్టీలను ఒక వేదిక పైకి తీసుకురాలని వారి మధ్య సయోధ్య కుదిర్చేలా చర్యలు చేపట్టాలని చిరు ఆలోచనలో ఉన్నారట. చిరంజీవి.. ఆయనతో పాటుగా ఇతర ఇండస్ట్రీ పెద్దలు ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియడానికి మరి కొద్ది రోజులు వేచి చూడాలి.