సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన క్రేజీ మూవీ `సర్కారు వారి పాట` ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి 14 ప్లస్ రీల్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు. తొలి రోజు మిశ్రమ స్పందనని సొంతం చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇటీవలే కర్నూలులో సక్సెస్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించారు.
అక్కడ ఫ్యాన్స్ ని చూసి ఎంజాయ్ చేసిన మహేష్ తను కూడా స్టేజ్ పైకి వెళ్లి స్టెప్పులేసి అదరగొట్టి ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. తాజాగా యూట్యూబర్ ల కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కీర్తి మెసేజ్ పెట్టిన సందర్భంలో మహేష్ డైలాగ్ చెప్పకుండా ఎగిరి సోఫాలో దూకేస్తారు. ఈ ఐడియా థియేటర్లో బాగా పేలింది. అసలు ఈ ఐడియా ఎవరిది అని అడిగితే మహేష్ తనదే అని చెప్పారు. అంతే కాకుండా ఈ సీన్ లో రియాక్షన్ ఇస్తూ డైలాగ్ చెప్పాలి. అయితే అది చాలా లెగ్తీ అనిపించింది.
సింపుల్ గా రియాక్షన్ తో చెబితే బాగుంటుందని అనిపించింది. అదే చేశాను. ఆ సీన్ చేసినప్పుడు సెట్ లో వున్న వాళ్లంగా గట్టిగా అరిచారు. అదే రియాక్షన్ థియేటర్లో నూ కనిపించిందన్నారు మహేష్.
సినిమా లో మెడపై రూపాయి బిల్ల టాటూ వేయించుకున్నారు మహేష్ అయితే నిజ జీవితంలో మాత్రం తనకు టాటూలు వేయించుకోవడం ఇష్టం వుండదని, అది చాలా కష్టం తో కూడుకున్నదని చెప్పారు. ఇదే సందర్భంగా కీర్తి సురేష్ సినిమాలో తనని తిట్టే సన్నివేశం గురించి ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.
సినిమా షూటింగ్ సమయంలో కీర్తితో జరిగిన ఓ సంఘటన మీతో పంచుకోవాలి. సినిమాలోని ఓ సీన్ లో కీర్తి నన్ను తిట్టాలి. అప్పటికి మూడు టేకులు తీసుకున్నాం. అయినా కీర్తి చేయలేకపోయింది. దాంతో డైరెక్టర్ తన దగ్గరికి వెళ్లి మేడమ్ సార్ ని మీరు తిట్టాలి. గుర్తు పె్టుకోండి మీరు తిట్టాలి అని మరీ నొక్కి చెప్పాడు. అయితే కీర్తి ఆసీన్ లో నన్ను తిట్టడానికి ఇబ్బందిపడుతోందని అర్థమైంది. వెంటనే `ఫరవాలేదు నువ్వు నన్ను తిట్టు` అన్నాను. సార్ నేను మిమ్మల్ని తిట్టలేను. ఒక వేళ తిట్టినా మీ ఫ్యాన్స్ నన్ను తిడతారు` అంటూ కంగారు పడింది.
నా ఫ్యాన్స్ ఏమీ అనరమ్మా ఫరవాలేదు నన్ను తిట్టు అని ఆ సీన్ కీర్తి చేత చేయించాను. అయితే మొన్న నా ప్యామిలీతో కలిసి సినిమాలో ఆ సీన్ చూస్తున్నప్పుడు సితార ఇచ్చిన రియాక్షన్ నేను ఎప్పుడూ చూడలేదు. తను నవ్వుతూ సోఫా నుంచి కిందపడేలా నవ్వింది` అంటూ ఆ సీన్ వెనకున్న సీక్రెట్ ని బయటపెట్టారు మహేష్.