బ్రహ్మోత్సవం ఆడియో ఫంక్షన్ అంగరంగ వైభవంగా.. ఓ పండగ రేంజ్ లో ఉంది. షెడ్యూల్ కంటే కాస్త ఆలస్యంగా మొదలైన ఈ కార్యక్రమం.. సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చిన తర్వాతే స్టార్ట్ చేశారు. మహేష్ బాబు - భార్య నమ్రతతో పాటు ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ - విజయనిర్మల కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
మామూలుగా ఆడియో రిలీజ్ అంటే.. దాదాపు ఒక గంట ఫంక్షన్ పూర్తయ్యాక హీరోలు ఎంట్రీ ఇస్తారు. కాని బ్రహ్మోత్సవం మాత్రం సరిగ్గా 8 గంటలకు.. మహేష్ బాబు వచ్చాకనే మొదలైంది. ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుండి అక్కడే ఉన్న హీరో మహేష్ కానీ ఒకసారి వచ్చాక ఈవెంట్ అంతా బోలెడంత ఎనర్జిటిక్ గా మారిపోయింది. మన హీరో ఎదురుగా కూర్చున్నాడన్న మాటే కానీ.. ప్రతీ విషయాన్ని బాగా అబ్జర్వ్ చేసేశాడు. అంతే కాదు.. తన దగ్గరకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తూ కనిపించాడు. నిర్మాత పీవీపీతో సహా సూచనలు ఇచ్చేస్తున్నాడు.
ఇదంతా చూసినవాళ్లకు ఓ విషయం మాత్రం అర్ధమైపోయింది. ఈ సంగీతోత్సవం కాన్సెప్ట్ అంతా మహేష్ స్వయంగా డిజైన్ చేసినదేనని.. తన డైరెక్షన్ లోనే ఈ ఈవెంట్ జరుగుతోందనే విషయం అర్ధమైపోయింది. మొత్తానికి సినిమా మేకింగ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో.. ఆడియో ఫంక్షన్ విషయంలో కూడా అంత కంటే ఎక్కువ అలర్ట్ గా ఉన్నాడనే విషయం అర్ధమవుతోంది.