తెలంగాణ మంత్రి కల్వకుంట్ల రామారావు సినిమా ప్రియుడన్న సంగతి తెలిసిందే. రాజకీయ నేతగా.. మంత్రిగా ఫుల్ బిజీగా ఉండే కేటీఆర్.. కొన్నిసార్లు వీలు చూసుకుని సినిమాలకు వెళ్తుంటాడు. తాజాగా ఆయన ‘భరత్ అనే నేను’ సినిమా చూశాడు. అనంతరం మహేష్ బాబుతో కలిసి ఒక చర్చా కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో భాగంగా గతంలో తన సినిమా ‘ఆగడు’ చూసి కేటీఆర్ ఏమన్నది మహేష్ పంచుకోవడం విశేషం. ‘స్టాప్ డూయింగ్ దిస్ నాన్సెన్స్’ అని అన్నాడట ‘ఆగడు’ చూసిన అనంతరం కేటీఆర్. ఈ మాట చెప్పినపుడు ఇటు మహేష్.. అటు కేటీఆర్ ఇద్దరూ నవ్వేశారు.
‘ఆగడు’ గురించి మహేష్ మాట్లాడటం మొదలుపెట్టగానే కేటీఆర్ తల పట్టుకోవడం విశేషం. ఈ సందర్భంగా మహేష్ తనను సర్ అని సంబోధిస్తుంటే.. అలా వద్దు రాము అనమని కేటీఆర్ చెప్పడం విశేషం. కేటీఆర్ ఎప్పుడు తన సినిమా చూసినా తనకు టెన్షన్ గానే ఉంటుందని.. ఎందుకంటే బాగుంటేనే బాగుందని చెబుతాడని.. లేదంటే బాలేదని ముక్కుసూటిగా చెప్పేస్తాడని అంటూ ‘ఆగడు’ ఉదాహరణ చెప్పాడు మహేష్. ఇక కొరటాల శివ ‘భరత్ అనే నేను’ కథ చెప్పి సీఎం పాత్ర చేయాలనగానే టెన్షన్ పడ్డానన్న మహేష్.. తనకు రాజకీయాల గురించి పెద్దగా తెలియదన్నాడు. కొరటాలకు మాత్రం రాజకీయాలపై గొప్ప పరిజ్నానం ఉందని.. ఆయన ఒక సందర్భంలో తనకు ఎమ్మెల్యే కావాలని ఉందని తనతో అన్నట్లు మహేష్ బాబు వెల్లడించడం విశేషం.