జక్కన్న నిర్ణయంతో ఆలోచనలో పడ్డ మహేష్ ఫ్యాన్స్..!

Update: 2020-04-19 17:30 GMT
దర్శకధీరుడు రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించనున్నట్టు అఫీషియల్‌ గా ప్రకటించాడు. ప్రముఖ టీవీ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్య్వూలో రాజమౌళి మాట్లాడుతూ 'దానయ్య గారితో సినిమా తర్వాత.. నారాయణ గారితో చేయాలి. నారాయణ గారు.. నేను మహేష్ బాబు కాంబినేషన్ అని ఎప్పట్ని నుంచో చెప్తున్నదే..’ అంటూ అనౌన్స్ చేసేసారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో వీరి కాంబోలో సినిమా రాబోతుందని అర్థమై పోయింది. దీంతో అటు రాజమౌళితో పాటు... ఇటు మహేశ్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఈ కేజ్రీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది 2021 ఎండింగ్ లో లేదా 2022 ప్రారంభంలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రాజమౌళి ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్. సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా విడుదలై తర్వాత మహేష్ బాబు కోసం స్టోరీ రెడీ చేసి పట్టాలెక్కించే సరికి అదే టైం పెట్టొచ్చని అనుకుంటున్నారు. జక్కన్న సూపర్ స్టార్ తో సినిమా చేస్తున్నాడని ఫ్యాన్స్ ఆనందపడుతున్నా కొన్ని విషయాల గురించి ఆలోచించి డిస్సప్పాయింట్ అవుతున్నారట. కారణం రాజమౌళి సినిమా అంటే మినిమమ్ రెండేళ్ల టైమ్ తీసుకుంటాడు.. రెగ్యులర్ గా సినిమాలతో వారి మధ్య ఉండే తమ అభిమాన హీరో రెండేళ్ల దాకా మరో సినిమా లేకుండా గ్యాప్ తీసుకుంటాడని ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా రాజమౌళితో సినిమా తీసిన ప్రతి హీరో ఆ సినిమా తర్వాత కొంతకాలం పాటు హిట్ సినిమాలకు దూరమై సతమతమవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ సెంటిమెంటే మహేష్ ఫ్యాన్స్ ని కూడా కలవరపెడుతోంది.

అంతేకాకుండా రాజమౌళి సినిమాకి ఇంకా చాలా సమయం ఉండటంతో ఈ గ్యాప్ లో మహేష్ వీలైనన్ని సినిమాలు తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ తన కెరీర్ లో 27వ సినిమాని డైరెక్టర్ పరశురామ్ చేతిలో పెడుతున్నాడు. అది వచ్చే నెలలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. పరశురామ్ సినిమా కంప్లీట్ అయ్యి - రాజమౌళి మూవీ స్టార్ట్ అయ్యే గ్యాప్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ లైన్ లో పెడితే బాగుంటదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే జక్కన్న సినిమాకంటే ముందు సూపర్ స్టార్ మరో రెండు సినిమాలు తీయొచ్చనేది అభిమానుల ఆలోచన. ఏదేమైనా రాజమౌళి కాంబోలో సినిమాకి ఇంకా చాలా టైమ్ ఉండటంతో ఇది సాధ్యపడేలాగే కనిపిస్తుందని సినీ అభిమానులు భావిస్తున్నారు.

Tags:    

Similar News