మహేష్.. ది బెస్ట్ డాడీ..

Update: 2018-06-18 11:26 GMT
టాలీవుడ్ లో స్టార్ హీరోల వారసులకు సంబందించిన ఫొటోలు రిలీజ్ అయితే అభిమానుల సంతోషం మాములుగా ఉండదు. వారసులను కూడా అభిమానూలు హీరోకంటే ఎక్కువగానే ప్రేమిస్తారు. నెక్స్ట్ కొంత మంది స్టార్ హీరోల వారసులపై చాలా మంది కన్ను పడింది. హీరోలు ఎప్పుడవుతారా? అని ఎదురు చూసే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇక హీరోలు కూడా వారి పిల్లలతో సంతోషంగా ఉంటూ జనాలకు నచ్చేలా చేస్తున్నారు.

ఆ సంగతి పక్కనపెడితే.. సినిమల్లో ఎంత కనిపించినా బయట కనిపించిన నటీనటులకు చాలా తేడా ఉంటుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా తన పిల్లల విషయానికి వచ్చే సరికి స్టార్ డమ్ ని అస్సలు చూపించరు. వారితో ఫ్రెండ్లిగా ఉంటూ సమయాన్ని కేటాయిస్తారు. టాలీవుడ్ ది బెస్ట్ ఫాదర్ లో మహేష్ టాప్ లో ఉంటాడరని చెప్పాలి. రీసెంట్ గా మహేష్ పిల్లలతో గడిపిన ఒక ఫొటోని నమ్రత సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

మంచి తండ్రి అని ప్రశంసిస్తూ ఒక కామెంట్ కూడా చేశారు. అందుకు సంబందించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి సినిమా కోసం సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు - అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. మరి ముఖ్య పాత్రలో అల్లరి నరేష్ కనిపించనున్న సంగతి తెలిసిందే.  
Tags:    

Similar News