గంగాన‌దిలో త‌ల్లి అస్థిక‌లు నిమ‌జ్జ‌నం చేసిన మ‌హేష్‌!

Update: 2022-10-03 05:34 GMT
సూప‌ర్ స్టార్ కృష్ణ స‌తీమ‌ణి...మ‌హేష్ త‌ల్లి ఇందిరాదేవి అనారోగ్య కార‌ణంగా ఇటీవ‌ల క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం మ‌హేష్ కుటుంబ స‌భ్యులు త‌ల్లి క‌ర్మ‌కాండ‌లు నిర్వ‌హించే ప‌నుల్లో ఉన్నారు. ఆ బాధ్య‌త‌లు అన్నింటిని మ‌హేష్‌- చిన్నాన్న ఆదిశేష‌గిరిరావు ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. తాజాగా ఐద‌వ‌రోజు ఇందిరాదేవి అస్తిక‌ల్నిహ‌రిద్వార‌లోని గంగాన‌దిలో మ‌హేష్ స్వ‌యంగా నిమ‌జ్జ‌నం చేసారు.

ఆ స‌మ‌యంలో మ‌హేష్ తో పాటు.. ఆదిశేష‌గిరిరావు వెంట‌ ఉన్నారు. న‌ది స‌మీపంలో కొన్ని ర‌కాల పూజ‌లు నిర్వ‌హించి అనంత‌రం అస్థిక‌లు న‌దిలో నిమ‌జ్జ‌నం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  సాధార‌ణంగా ఇలాంటి ఫోటోలు నెట్టింట లీక్ కాకుండా సెల‌బ్రిటీలు జాగ్ర‌త్త‌ప‌డుతుంటారు.

ఇలాంటి విష‌యాల్లో ప్రైవ‌సీ త‌ప్ప‌నిస‌రి. ఫోటోలు తీయ‌డానికి గానీ... వాటిని ప‌బ్లిష్ చేయ‌డానికి గానీ ఎవ‌రు అంగీక‌రించరు. మహేష్ ఫోటోలు అన‌ధికారికంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల స్వ‌ర్గ‌స్తులైన‌  కృష్ణంరాజు అంత్య‌క్రియుల కార్య‌క్ర‌మంలో ప‌లువురు సెల‌బ్రిటీలు పాల్గొన్నారు. ఇంటి ద‌గ్గ‌ర నుంచి అంతిమ‌ యాత్ర వ‌ర‌కూ మీడియా క‌వ‌ర్ చేసింది.

కానీ స్మశాన వాటిక కు మాత్రం మీడియాని అనుమ‌తించ‌లేదు. ఇలాంటి సంద‌ర్భాల వీడియోలు  సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాలుగా వైర‌ల్ అవుతున్నాయి. ఆ కార‌ణంగానే కృష్ణంరాజు కుటుంబ స‌భ్యులు మీడియాని దూరం పెట్టారు. ఇలాంటి సంద‌ర్భానికి సంబంధించిన‌ వీడియోలు అభిమానులపైనా తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తున్నాయి.

హీరోలు క‌న్నీళ్లు పెట్టుకుంటే చూసి త‌ట్టుకోలేని  డైహార్డ్ అభిమానులు కొంత మంది ఉన్నారు. ఆ వీడియోలు మాన‌సిక కృంగుబాటుకు దారి తీస్తున్నాయి. త‌ల్లి మ‌ర‌ణంతో మ‌హేష్  ఎంత‌గా కృంగిబాటుకు గుర‌య్యారో తెలిసిందే.

తొలుత వాటి తాలుకా కొన్ని వీడియోలు నెట్టింట హ‌ల్చ‌ల్ చేసాయి. అయితే ఆ త‌ర్వాత వాటిని సోష‌ల్ మీడియా నుంచి తొల‌గించారు. మ‌హేష్ అభిమానుల్ని మ‌రింత దుఖ‌సాగ‌రంలో దించ‌డానికి ఆస్కారం ఉంటుంద‌నే వాటిని తొల‌గించిన‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది. అలాగే అంత‌కు ముందు ప్ర‌భాస్ వీడియోలు కూడా కొన్నింటిని తొల‌గించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News