మహేష్ బాబు ఫ్యామిలీ గురించి మనకు తెలియంది ఏముంది? ఐతే నమ్రతా శిరోద్కర్ మాత్రం మనందరికీ ఓ కొత్త విషయం చెబుతోంది. తమ కుటుంబంలో ట్రిప్లెట్స్ ఉన్నారట. కావాలంటే చూస్కోండి అంటూ ఆ ట్రిప్లెట్స్ ఫొటోల్ని కూడా ట్విట్టర్ లో షేర్ చేసింది. ఇంతకీ ఎవరా ట్రిప్లెట్స్ అంటే.. మహేష్ బాబు - గౌతమ్ కృష్ణ - సితార. మహేష్ కుర్రాడిగా ఉన్నప్పటి ఫొటోకు దగ్గరగా ఉన్న గౌతమ్ - సితారల ఫొటోల్ని కలిపి ట్విట్టర్ లో పెట్టి.. తాను షేర్ చేసింది ట్రిప్లెట్స్ అని కామెంట్ చేసింది నమ్రత. ఈ ఫొటో చూస్తే నిజంగానే మహేష్ - గౌతమ్ - సితార ముగ్గురూ ఒకేలా కనిపిస్తున్నారు. మహేష్ పిల్లలిద్దరికీ కూడా అతడి పోలికలే వచ్చాయి. ఇద్దరూ అతడి నోటి నుంచే ఊడిపడ్డట్లే ఉంటారు. తన పిల్లలిదద్దరినీ అమితంగా ఇష్టపడే మహేష్... తరచుగా వాళ్లతో టూర్లు వేస్తుంటాడు. ఈ మధ్యే మహేష్ ప్యారిస్ చుట్టొచ్చిన సంగతి తెలిసిందే.