మ‌హేష్.. ఈసారైనా ఖాయ‌మా?

Update: 2016-02-29 07:00 GMT
ఇప్ప‌టికే బోలెడ‌న్ని సినిమాల‌కి క‌మిట్ అయ్యాడు మ‌హేష్‌ బాబు. ఆయ‌న ఎప్పుడు ఖాళీ అవుతాడో కూడా తెలియ‌దు. బ్ర‌హ్మోత్స‌వం త‌ర్వాత మురుగ‌దాస్ సినిమా, ఆ త‌ర్వాత పూరి సినిమా - ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్‌ - జ‌యం రాజా... ఇలా బోలెడంత మంది ద‌ర్శ‌కులు లైన్లో ఉన్నారు. కానీ అశ్వ‌నీద‌త్ మాత్రం మ‌హేష్ మా సినిమా కూడా చేయ‌బోతున్నాడ‌ని చెబుతున్నారు. మ‌హేష్‌ బాబు - అశ్వ‌నీద‌త్ కాంబినేష‌న్ లో ఓ  సినిమా తెర‌కెక్కనుంద‌ని ఎప్ప‌ట్నుంచో ప్ర‌చారం సాగుతోంది. అశ్వ‌నీద‌త్ స్వ‌యంగా  ప‌లుమార్లు  ప్ర‌క‌టించాడు. ఒక‌సారి పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడ‌ని, మ‌రొక‌సారి రాజ్‌-డికె ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంద‌ని, మ‌రోసారి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో అని ఇలా బోలెడ‌న్ని పేర్లు చెప్పారు.  కానీ ఆ కాంబినేష‌న్‌ లో సినిమా ఏదీ ప‌ట్టాలెక్క‌లేదు. మ‌హేష్ అయితే అశ్వ‌నీద‌త్‌ కి మాటిచ్చాడ‌ట‌. కానీ క‌థే సెట్ట‌వ్వ‌డం లేదు.

ఇప్పుడు మ‌రోసారి అశ్వ‌నీద‌త్ త్వ‌ర‌లోనే మ‌హేష్‌ తో సినిమా ఉంటుంద‌ని చెబుతున్నారు. అది గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంద‌ని, వ‌చ్చే యేడాది స‌మ్మ‌ర్‌ కి రిలీజ్ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా సినిమాని మొద‌లుపెడ‌తామ‌ని అశ్వ‌నీద‌త్ మీడియాతో స్ప‌ష్టం చేశాడు. వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై ఒక‌ప్పుడు భారీ చిత్రాల్ని తెర‌కెక్కించారు అశ్వ‌నీద‌త్‌. అయితే శ‌క్తి ఫ్లాప్ ఆయ‌న్ని బాగా దెబ్బ‌కొట్టింది. ఆ చిత్రానికి భారీగా న‌ష్టాలొచ్చాయి. ఇప్పుడు మ‌ళ్లీ మ‌హేష్ సినిమాతో ఫామ్‌ లోకి రావాల‌న్న ఆలోచ‌న‌లో అశ్వ‌నీద‌త్ ఉన్నారు.
Tags:    

Similar News