హీరో మహేష్ బాబు.. దర్శకుడు కొరటాల శివలకు శ్రీమంతుడు ఎంత పెద్ద సక్సెస్ ను అందించిందో.. ఆ తర్వాత అంత పెద్ద తలనొప్పులను కూడా తెచ్చిపెట్టింది. తన కథను కాపీ కొట్టి సినిమా తీశారంటూ.. రైటర్ శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించేశాడు. చచ్చేంత ప్రేమ అనే నవలను కాపీ చేశారన్నది ఈ రచయిత ఆరోపణ.
దీనిపై కొరటాల శివతో పాటు మహేష్ కి కూడా నాంపల్లి క్రిమినల్ కోర్ట్ సమన్లను కూడా జారీ చేసింది. జనవరి 24న విచారణ కోసం కోర్టుకు హాజరు కావాలన్నది వీటి సారాంశం. అయితే.. వీరిద్దరూ ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించారు. మహేష్ తరఫున మహేష్ బాబు ఎంటర్టెయిన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్.. అలాగే కొరటాల శివ.. తమపై జారీ చేసిన సమన్లను నిలిపివేయాలని కోరారు. వీటిని పరిశీలించిన కోర్టు.. నాంపల్లి క్రిమినల్ కోర్టు జారీ చేసిన సమన్ల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు.
ఇది మహేష్ అండ్ కొరటాల ఇద్దరికీ పెద్ద రిలీఫ్ అని చెప్పాల్సిందే. త్వరలో కొత్త సినిమా మొదలుపెట్టేందుకు కూడా రెడీ అయిపోతున్న వీరిద్దరికీ.. గత సినిమా విషయంలో కోర్టుకు హాజరు కావాల్సి రావడం ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి ఇది ఊరట కలిగించే విషయం అయినా.. ఇండియన్ పీనల్ కోడ్ లోని కాపీరైట్ చట్టం ప్రకారం దాఖలు అయిన ఈ కేసును.. కోర్టు తీవ్రంగానే పరిగణించే అవకాశాలున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/