అమెరికాలోని మిన్నియాపోలిస్ లో మే 25 వ తారీఖున జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తి పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించడంతో రోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయాడు. జార్జ్ నల్లజాతీయుడు కావడం.. పోలీసు ఆఫీసర్లు శ్వేతజాతీయులు కావడంతో ఇది జాతి వివక్ష అంశం అంటూ ప్రజలు శ్వేతజాతీయుల అహంకారానికి వ్యతిరేకంగా గళమెత్తారు. అమెరికాలో గత కొన్ని రోజులుగా ఈ విషయంపై ఆందోళనలు జరుగుతున్నాయి. ఇక నిన్న అయితే #బ్లాక్ అవుట్ ట్యూస్ డే అంటూ ప్రపంచవ్యాప్తంగా ఓ హ్యాష్ టాగ్ ట్రెండ్ అయింది. ఈ హ్యాష్ టాగ్ కు పలువురు భారతీయ ప్రముఖులు మద్దతు ప్రకటించారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ విషయంలో స్పందిస్తూ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక బ్లాక్ కలర్ బాక్స్ ఫోటోను షేర్ చేశారు. దీనికి #బ్లాక్ ట్యూస్ డే అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మహేష్ పలు సందర్భాలలో సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. గతంలో 'జల్లి కట్టు' అంశంలో కూడా మహేష్ స్పందించిన విషయం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. తాజాగావర్ణ వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి తన మద్దతు ప్రకటించారు.
ఇదిలా ఉంటే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై స్పందించారు. ఇషాన్ ఖట్టర్.. విక్కీ కౌశల్.. కరణ్ జోహార్.. సారా అలీ ఖాన్ తదితరులు నలుపు రంగు పోస్ట్ లు పెట్టి వర్ణవివక్షపై తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. టాలీవుడ్ భామ రాకుల్ ప్రీత్ సింగ్ ఈ విషయంపై స్పందిస్తూ జాన్ ఎఫ్ కెన్నెడీ కొటేషన్ ను పోస్ట్ చేసింది. "ఒక్క మనిషి హక్కుకు హాని కలిగినా.. అందరి హక్కులకు ముప్పు వాటిల్లినట్టే" అనే కొటేషన్ తో పాటుగా "జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సాగుతోంది. రక్షించవలసిన లా అండ్ ఆర్డర్ నాశనం చేస్తుందో .. అప్పుడు మనమంతా నిశ్శబ్దంగా ఉండలేము" అంటూ తన నిరసనను ప్రకటించింది.