మళ్లీ ఫ్యామిలీతో మహేష్ ట్రిప్

Update: 2017-12-19 08:34 GMT
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తన కెరీరి ను ఎలా కొనసాగించినా కూడా ఒక ఫ్యామిలీ పర్సన్ గా మాత్రం చాలా సింపుల్ గా ఉంటారని అందరికి తెలిసిన విషయమే. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఫ్యామిలీని ఏ మాత్రం మిస్ కాకుండా వారితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. స్పైడర్ రిజల్ట్ తేడా రావడంతో మహేష్ కొన్ని నెలల క్రితం విదేశాల్లో గడిపివచ్చాడు. ఇక ప్రస్తుతం భరత్ అనే నేను సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు.

అయితే చాలా రోజుల నుండి షూటింగ్ లతో బిజీగా ఉండడంతో మహేష్ మళ్లీ కొంచెం బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో క్రిస్మస్ - న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని జరుపుకోవాలని అననుకుంటున్నాడట. అందుకోసం త్వరలోనే విదేశాలకు వెళ్లనున్నాడట. అందమైన ప్రదేశాలను ఫ్యామిలీతో కలిసి చుట్టేయ్యాలని మహేష్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది కూడా విదేశాల్లోనే సెలబ్రేట్ చేసుకున్న మహేష్‌ .. ఇప్పుడు కూడా అటే వెళ్తున్నాడనమాట. అయితే ఎప్పటిలాగానే ముందు దాబాయ్ / అబు దాబిలలో కాస్ ఎంజాయ్ చేసి.. తరువాత ఏదన్నా యురోప్ కంట్రీ వెళ్తారా? లేదంటే ఏసియన్ కంట్రీకి వెళతారా? చూడాలి.

ఇకపోతే ప్రస్తుతం భరత్ అనే నేను సినిమా దాదాపు సగానికి పూర్తయ్యింది. తమిళనాడులో కొన్ని యాక్షన్స్ సీన్స్ ని దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తున్నాడు. ఆ షెడ్యూల్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసుకొని మళ్లీ జనవరి సెకండ్ వీక్ లో నెక్స్ట్ షెడ్యూల్ ని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతోన్న సంగతి తెలిసిందే. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా 2018 ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.    
Tags:    

Similar News