మహేష్ లుక్ షూట్ పూర్తయ్యిందట

Update: 2017-05-13 09:05 GMT
శ్రీమంతుడు తర్వాత మరోసారి మహేష్ తో సినిమా తీసి హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న డైరెక్టర్ కొరటాల శివ చాలారోజులుగా వెయిటింగ్ లో ఉన్నాడు. జనతా గ్యారేజ్ పూర్తయిన దగ్గర నుంచి మహేష్ డేట్స్ ఎప్పుడు దొరుకుతాయా అని ఎదురుచూస్తూ ఉన్నాడు. మహేష్ ఏమో మురుగదాస్ తో తీస్తున్న స్పైడర్ కమిట్ మెంట్ తో బిజీగా ఉండిపోయాడు. తెలుగు - తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ బాగా డిలే అయిపోయింది. అయినా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కావడంతో డేట్స్ పొడిగిస్తూ మహేష్ కూడా సహకరిస్తూ వచ్చాడు. ఎట్టకేలకు ఈ సినిమా ఫినిషింగ్ స్టేజ్ కు రావడంతో కొరటాల శివ షూటింగ్ పనుల్లోకి దిగిపోయాడు.

‘భరత్ అనే నేను’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ లుక్ షూట్ ఇటీవల పూర్తి చేశారు. ముంబయిలోని ఓ స్టూడియోలో సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్, డైరెక్టర్ శివ ఈ షూట్ లో పాల్గొన్నారని సినిమా వర్గాల సమాచారం. రెగ్యులర్ షూటింగ్ ఈనెల 16 నుంచి హైదరాబాద్ లో మొదలు పెట్టనున్నారు. సినిమాలో కొంతభాగాన్ని లండన్ లో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకు డి.వి.వి.దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీని తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించిన ఎం.ఎస్. ధోనీ చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటించింది.

‘భరత్ అనే నేను’ సినిమాను 2018 నాటికి రిలీజ్ చేయాలన్నది నిర్మాత దానయ్య ఆలోచన. అయితే సినిమా షూటింగ్ మహేష్ పూర్తిస్థాయిలో ఎప్పటి నుంచి ఇన్వాల్వ్ అవతాడన్న దానిపై క్లారిటీ లేదు. ఎందుకంటే మురుగదాస్ స్పైడర్ సినిమాకు సంబంధించి ఇంకా కొంత వర్క్ మిగిలిపోయి ఉంది. సో, ‘భరత్ అనే నేను’ షూటింగ్ ముందుకెళ్లాలంటే ముందు మురుగదాస్ పని పూర్తి చేయాలన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News