చిట్టిబాబుకి మహర్షి ఎసరు?

Update: 2019-05-28 07:16 GMT
విక్రమార్కుడి భుజాన ఎక్కిన భేతాళుడిలా అర్థం కాని ఒక విచిత్ర స్థితిలో సాగుతోంది మహర్షి రన్. మహేష్ బాబు విదేశాలకు వెళ్ళిపోయాక ప్రమోషన్లకి పూర్తిగా చెల్లు చీటీ పాడేసిన టీం ఇప్పుడు ఫైనల్ ఫిగర్స్ ఎంత వస్తాయో అని ఎదురు చూస్తోంది. మొదటి వారం ఊదరగొట్టినట్టుగా మహర్షి మహేష్ కెరీర్ బెస్ట్ గా నిలిచే ఛాన్స్ లేనట్టే. భరత్ అనే నేనుని దాటితే చాలు అనేలా ఉన్న మహర్షి నైజాంలో మాత్రం తన తడాఖ చూపించాడు.

అందుతున్న సమాచారం మేరకు 19 రోజులకు గాను మహర్షి 28 కోట్ల దాకా షేర్ తెచ్చినట్టుగా టాక్. పాత రికార్డు లాస్ట్ ఇయర్ వచ్చిన రంగస్థలం మీద ఉంది. రామ్ చరణ్ 27 కోట్ల 70 లక్షల దగ్గర ఆగిపోయాడు. ఇవి నిజమా కాదా అనే వాదనలు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య జరుగుతున్నప్పటికీ రంగస్థలం టైంలో జిఎస్టి అధికంగా ఉంది. టికెట్ రేట్లకు రెక్కలు రాలేదు. ఈ రెండు మహర్షికి చాలా అనుకూలంగా మారాయి కాబట్టి ఈ రికార్డు సాధ్యమయ్యిందని ట్రేడ్ మాట

ఒకవేళ ఎపిక్ బ్లాక్ బస్టర్ ట్యాగ్ సార్థకమవ్వాలి అంటే అన్ని ఏరియాలలో ఇదే పెర్ఫార్మన్స్ చూపించి ఉండాలి. కాని మహర్షి ఓవర్సీస్ తో పాటు సీడెడ్ లో నెట్ లాస్ ఇచ్చేశాడు. రంగస్థలం యునానిమస్ గా అన్ని చోట్లా లాభాలు పంచింది. సో ఒక్క ప్రాంతాన్ని బేస్ చేసుకుని మహర్షి రంగస్థలం దాటేసిందనే స్టేట్ మెంట్ జెనరిక్ గా ఇవ్వలేం.

కాని నైజాంవరకు మహేష్ ఫ్యాన్స్ ఇది గర్వంగా చెప్పుకునే ఘనతే. ఫైనల్ రన్ కు దగ్గరలో ఉన్న మహర్షి వంద కోట్ల షేర్ కలలో మాటే అని తేలిపోయింది. ప్రధాన కేంద్రాలు మినహాయించి ధియేటర్లు తక్కువగా ఉన్న చాలా చోట్ల ఈ శుక్రవారమే లిఫ్ట్ చేయబోతున్నారు. ఏదో ఒకటి మొత్తానికి చిట్టుబాబుని దాటే రికార్డు ఒకటి మహర్షి సాదించాడన్న మాట
Tags:    

Similar News