మొత్తానికి సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా టైటిలేంటో తెలిసిపోయింది. కొన్ని రోజులుగా ఆసక్తికర హింట్స్ ఇస్తూ.. టైటిల్ మీద క్యూరియాసిటీ పెంచిన చిత్ర బృందం.. బుధవారం రాత్రి ఉత్కంఠకు తెరదించింది. మహేష్ కెరీర్ లో మైలురాయి అనదగ్గ 25వ చిత్రానికి ‘మహర్షి’ అనే టైటిల్ ఖరారు చేసింది. ఈ టైటిల్.. ఫస్ట్ లుక్.. ఫస్ట్ టీజర్ విషయంలో పాజిటివ్ ఫీడ్ బ్యాకే వచ్చింది. మునుపెన్నడూ కనిపించని లుక్ లో మహేష్ డిఫరెంటుగా కనిపించాడు. ఐతే ఈ చిత్రానికి ‘మహర్షి’ అనే టైటిల్ బాగానే ఉన్నప్పటికీ.. ఆల్రెడీ వాడేసిన సినిమా పేరును ఉపయోగించుకోవడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
లెజెండరీ డైరెక్టర్ వంశీ కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘మహర్షి’ ఒకటి. అందులో రాఘవ హీరోగా నటించాడు. ఈ చిత్రం ఫ్లాప్ అయింది కానీ.. అయినా కూడా ఒక క్లాసిక్ గా గుర్తింపు పొందింది. ఇందుకు ప్రధాన కారణం ఇళయరాజా సంగీతం. అందులోని పాటలు ఇప్పటికీ మార్మోగుతుంటాయి. ఫ్లాప్ అయినప్పటికీ ఒక క్లాసిక్ గా నిలిచిపోయిన ఆ టైటిల్ ను మహేష్ సినిమాకు వాడుకోవడంపై జనాలు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఒక ఫ్లాప్ సినిమా టైటిల్ తీసుకోవడమేంటి అని కొందరంటుంటే.. పాత క్లాసిక్ టైటిళ్లను తీసుకున్నపుడు మంచి ఫలితాలు అందిన దాఖలాలు పెద్దగా లేవని కొందరు గుర్తు చేస్తున్నారు. ఇక్కడో చిత్రమైన విషయం ఏంటంటే.. ఆ ‘మహర్షి’కి.. ఈ ‘మహర్షి’కి దర్శకుడి పేరు ఒక్కటే. మహేష్ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ ‘మహర్షి’ ఆ ‘మహర్షి’కి భిన్నంగా మంచి కమర్షియల్ సక్సెస్ సాధిస్తుందా.. క్లాసిక్ స్టేటస్ అందుకుంటుందా అన్నది ఆసక్తికరం. మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాతలు దిల్ రాజు.. అశ్వినీదత్.. పీవీపీ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే వేసవిల ప్రేక్షకుల ముందుకొస్తుంది.