ప్రిన్స్ మహేష్ బాబు సాధారణంగా ఎలాంటి వివాదాల్లోనూ తలదూర్చే ప్రయత్నం కాదు కదా కనీసం దరిదాపుల్లోకి వెళ్లే సాహసం కూడా చేయడు. ఆ శైలే ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాపాడింది. కానీ ఎంత స్టార్ అయినా సోషల్ మీడియా మేనేజ్ మెంట్ లో ఏమరుపాటుగా ఉంటే మాత్రం విమర్శలు తప్పని పరిస్థితి ఇప్పుడు ఉంది. నిన్న జరిగిన ఆర్ ఆర్ ఆర్ లాంచ్ గురించి అభిమానుల మధ్య చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అరుదైన కలయికగా అభివర్ణిస్తూ సెలెబ్రిటీలు ట్వీట్లు పెడుతున్నారు.
నిన్న టాక్సీ వాలా లాంచ్ కు వెళ్లిన అల్లు అర్జున్ ఈవెంట్ తో సంబంధం లేకపోయినా ప్రత్యేకంగా ఆర్ ఆర్ ఆర్ గురించి ప్రస్తావించి చరణ్ తారక్ రాజమౌళిలకు విషెస్ చెప్పాడు. ఇక ట్విట్టర్ వేదికగా వచ్చిన అభినందనల వెల్లువకు లెక్కే లేదు. సహజంగానే మహేష్ బాబు దీని గురించి ఏదైనా ప్రస్తావిస్తాడేమో అని ఎదురు చూసారు ఇద్దరు హీరోల ఫ్యాన్స్. కానీ ఇప్పటిదాకా ఎలాంటి అప్ డేట్ లేదు. తెలుగులో అంతగా స్పందన దక్కించుకోలేకపోయిన సర్కార్-నవాబ్ ల గురించి ప్రత్యేకంగా పొగుడుతూ ట్వీట్ చేసిన మహేష్ ఇంత పెద్ద ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ఓపెనింగ్ గురించి కనీసం ప్రస్తావించకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
అసలే అరవింద సమేత వీర రాఘవ గురించి ట్వీట్ చేయలేదనే చిరుకోపం తారక్ ఫ్యాన్స్ లో ఇప్పటికే ఉంది. భరత్ అనే నేను ఆడియోకి గెస్ట్ గా వచ్చిన విషయాన్నీ క గుర్తు చేస్తున్నారు. అదే రోజు చరణ్ తారక్ లతో కలిసి మహేష్ చేసుకున్న పార్టీ ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి కూడా. అయినా మహేష్ స్నేహ ధర్మాన్ని మరిచి ఆర్ ఆర్ ఆర్ లాంచ్ గురించి చెప్పకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ రెండు మూడు రోజుల్లో ఏదైనా సమాధానం వస్తుందేమో వేచి చూడాలి.