వావ్ అనిపిస్తున్న మహేష్ బాబు

Update: 2015-12-07 07:06 GMT
సూపర్ స్టార్ అంటే స్టైల్ కి చిరునామా అనుకోవచ్చు. మన సూపర్ స్టార్ కృష్ణ - సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ లు స్టైల్ కి కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు వీళ్లని మించి పోయి స్టైల్ ఐకాన్ అయిపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మామూలుగానే కత్తిలాంటి లుక్స్ తో ఇరగదీసే మహేష్.. నమ్రతతో మ్యారేజ్ తర్వాత మరింత హ్యాండ్ సమ్ గా మారిపోయాడని చెప్పడంలో ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు.

లేటెస్ట్ బ్లాక్ బస్టర్ శ్రీమంతుడు తర్వాత.. మహేష్ తన కెరీర్ లోనే టాప్ స్టేజ్ కి చేరిపోయాడు. ఇప్పటికే ఈ టాలీవుడ్ ప్రిన్స్.. దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించేసుకున్నాడు. "వావ్" మేగజైన్ లేటెస్ట్ ఎడిషన్ కవర్ పేజ్ పై మహేష్ లుక్స్ ని చూసిన ఎవరైనా సరే మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే. బ్లాక్ జాకెట్ వేసుకుని.. అల్ట్రా మోడర్న్ లుక్స్ లో కనిపిస్తున్న మహేష్ బాబుని చూసి.. ఇతనికి 40 ఏళ్ల ఏజ్ ఉంటుందంటే ఎవరికైనా నమ్మడం కష్టమే.

టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకున్న యాక్టర్లతో ప్రచురించిన ఓ ఆర్టికల్ లో... మహేష్ గురించి బోలెడన్న సంగతులు రాయడం విశేషం. ప్రస్తుతం బ్రహ్మోత్సవంలో షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్... ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లతో ఆడిపాడనున్నాడు. ఆ తర్వాత సూపర్ స్టార్ చేయబోతున్న మురుగదాస్ మూవీ కోసం డబుల్ రోల్ చేయనున్నాడని, అలాగే ఇందుకోసం పాతిక కోట్ల రెమ్యూనరేషన్ అందుకోనున్నాడని టాక్. ఇది నిజమే అయితే.. టాలీవుడ్ లో ఇంత రెమ్యూనరేషన్ అందుకున్న తొలి హీరోగా మహేష్ పేరిట మరో రికార్డ్ నమోదవుతుంది.
Tags:    

Similar News