కెటిఆర్ కు ప్రామిస్ చేసిన మహేష్‌

Update: 2018-04-27 05:08 GMT
చేనేత వస్త్రాలకు ప్రచారం.. టాలీవుడ్ టాప్ బ్యూటీ సమంత కారణంగా.. ఈ అంశానికి విపరీతమైన ప్రచారం దక్కింది. హ్యాండ్ లూమ్స్ అంటే.. అవేవో పాతకాలం నాటి దుస్తులు అనే ఫీలింగ్ ఉన్నవారికి.. సమంత చేసిన ప్రచారం చూసి కళ్లు తిరిగిపోయాయి. లేటెస్ట్ ట్రెండ్ కు ఏ మాత్రం తీసిపోకుండా.. ఆ మాటకు వస్తే మరింత హుందాగా కనిపించాయి ఈ ఫ్యాబ్రిక్స్.

ఇప్పుడు బ్యూటీ సమంతకు స్టార్ హీరో మహేష్ బాబు తోడు వస్తున్నాడు. తెలంగాణలో చేనేత వస్త్రాలకు ప్రచారం చేసేస్తున్నాడు. బ్రాండ్ అంబాసిడర్ లాంటి పదాలు పక్కన పెట్టేస్తే.. తను సినిమాల్లో కూడా చేనేత వస్త్రాలను ధరిస్తానంటూ.. మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ సాక్షిగా మహేష్ ప్రామిస్ చేసేశాడు. భరత్ అనే నేను ప్రమోషన్ కోసం కొరటాల శివ.. మహేష్ లతో కలిసి ఓ ఈవెంట్ కు కేటీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు హ్యాండ్ లూమ్స్ ధరించి రావాల్సిందిగా సూచించారట కేటీఆర్. ఆ డ్రెస్ చాలా కూల్ అండ్ కంఫర్టబుల్ గా మాత్రమే కాకుండా.. స్టైలిష్ గా ఉందని కేటీఆర్ కు థ్యాంక్స్ చెబుతూ మహేష్ ట్వీట్ పెట్టాడు.

చేనేత వస్త్రాల ప్రమోషన్ తన మనసుకు ఎంతో దగ్గరైన అంశం అని రిప్లై ఇచ్చిన కేటీఆర్.. రాబోయే సినిమాల్లో కూడా వీటిని ధరించాలంటూ సలహా ఇచ్చారు. దీనికి వెంటనే.. 'తప్పకుండా చేస్తాను సర్' అనే అర్ధం వచ్చేలా రిప్లై ఇచ్చాడు మహేష్.

ఒక్క సారి మాట ఇచ్చాడంటే.. ఆ మాట మీద నిలబడి తీరతానంటూ భరత్ అనే నేను మూవీలో మహేష్ చెప్పిన డైలాగ్ మాదిరిగానే.. ఇప్పుడు కేటీఆర్ కు ప్రామిస్ చేశాడు కాబట్టి.. తనమాట నిలబెట్టుకునేందుకు మహేష్ ఇకపై హ్యండ్ లూమ్ ప్రమోషన్స్ కంటిన్యూ చేసేయచ్చు.
Tags:    

Similar News