ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణను పూర్తి చేసేందుకు ప్రణాళికల్లో ఉన్న సంగతి తెలిసిందే. కోవిడ్ 19 సెకండ్ ఏవ్ మరోసారి చిత్రబృందాన్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసింది. వరుసగా రాజమౌళి- రామ్ చరణ్- తారక్ కోవిడ్ భారిన పడి చికిత్సతో కోలుకున్నారు. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గగానే తదుపరి ఆలియాతో కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం జక్కన్న ప్రిపరేషన్ లో ఉన్నారు. ఈలోగానే లాక్ డౌన్ తో షూటింగ్ వాయిదా పడింది.
ఆర్.ఆర్.ఆర్ తర్వాత మహేష్ తో రాజమౌళి కమిట్ మెంట్ గురించి తెలిసినదే. జక్కన్న కోసం ఇప్పటికే సూపర్ స్టార్ కాల్షీట్లు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారు. 2020లోనే రాజమౌళి - మహేష్ ప్రాజెక్టుపై ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. వెటరన్ నిర్మాత కె.ఎల్. నారాయణ ఈ భారీ చిత్రానికి నిధులు సమకూర్చనున్నారు.
ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ-``మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ కోసం కాల్షీట్లు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్ తో తన తదుపరి చిత్రం కథ కోసం జక్కన్న పని చేస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్తుంది`` అని తెలిపారు. రాజమౌళి ఇంకా కథను లాక్ చేయలేదని.. దానిపై వర్క్ జరుగుతోందని వెల్లడించారు.
మహేష్ కోసం ఇప్పటికే రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ లైన్ ని లాక్ చేసి ఉండొచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. ఆయన ఒకేసారి టాలీవుడ్ బాలీవుడ్ ప్రాజెక్టుల కోసం పని చేస్తున్నారు కాబట్టి ఈ కథ రెడీ అయ్యేందుకు ఎక్కువ సమయం పట్టే వీలుంది.