నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `అఆ` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మొదట వై దిస్ కొలవెరి సాంగ్ ఫేం అనిరుధ్ ని సంగీత దర్శకుడుగా తీసుకున్నారు. కానీ అనిరుధ్ అనుకున్న సమయానికి ట్యూన్స్ ఇవ్వక పోవడం, సరిగా రెస్పాన్స్ కూడా లేక పోవడంతో సినిమా చాలా డిలే అవుతోందట. ఇలా అయితే సినిమాను ముందుగా అనుకున్న టైమ్ కి రిలీజ్ చేయడం కష్టం అని భావించిన త్రివిక్రమ్, ఈ ప్రాజెక్ట్ నుంచి అనిరుధ్ ని తొలంగించాడు. ఆ స్థానంలో మరో సంగీత దర్శకుడిని తీసుకోవాలని ఫిక్సయ్యాడు. కానీ ఎవరిని తీసుకోవాలి? అన్న డైలమాలో పడ్డాడు. చాలా మంచి సంగీత దర్శకుల పేర్లు తెర మీదకు వచ్చాయి.
ఇలాంటి క్రమంలో మహేష్ బాబు మిక్కీ జే మేయర్ ని తీసుకొమ్మంటూ సలహా ఇచ్చాడట త్రివిక్రమ్ కి. ఇక మహేష్ బాబే స్వయంగా చెప్పడంతో త్రివిక్రమ్ కి మిక్కీ పై కాన్పిడెన్స్ వచ్చి, వెంటనే ఫైనల్ చేసినట్లు సమాచారం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి మిక్కీ మ్యూజిక్ చేశాడు. ఆ పాటలు మహేష్ కి చాలా ఇష్టం. ఆ నమ్మకంతోనే మళ్లీ బ్రహ్మోత్సవం చిత్రానికి కూడా మరోసారి మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాకు ఎక్స్లెంట్ సాంగ్స్ ఇచ్చాడట మిక్కీ. ఆ నమ్మకంతోనే మహేష్ -త్రివిక్రమ్ కి మిక్కీ జే మేయర్ ని తమ సినిమాకు పెట్టుకోమని సజెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.