ఓటేస్కోండి అంటున్న మహేష్‌

Update: 2016-02-01 13:18 GMT
ఇక తెల్లారితే గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ ఎన్నికలు అనే సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఓటర్‌ టర్నవుట్‌ సంఖ్య బాగా పెరగాలని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయి. అందుకే గవర్నమెంటు వారు కూడా పాపులర్‌ సెలబ్రిటీలతో ఓటు వేయాలంటూ ప్రచారం చేయిస్తున్నారు.

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఇదే విషయంపై ట్వీట్‌ వేశారు. దయచేసి వెళ్లి ఎన్నికల్లో ఓటేయండి.. మీ ఓటు సద్వినియోగ పరుచుకుని.. కౌంట్‌ అయ్యేలా చూస్కోండి అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇక ఇతర సెలబ్రిటీస్‌ చాలామంది ఇదే విషయంపై ట్వీట్లేశారు. వెళ్లి ఓటేయండి అంటున్నారు. బహుశా మహేష్‌ - అల్లు అర్జున్‌ - జూ.ఎన్టీఆర్‌ - రామ్‌ చరణ్‌ వంటి స్టార్లు రేపు ఓటు హక్కును వినియోగించుకునే ఛాన్సుంది.

అసలు గ్రేటర్‌ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని అందరూ ఆసక్తిగా చూస్తుంటే.. ఆంధ్రావారంతా మాకే ఓటేస్తారని తెరాస ధీమా వ్యక్త పరుస్తోంది. ఎన్నికలు మావే, మేయర్‌ పదవీ మాదే అని చెప్పుకొచ్చారు వారు.
Tags:    

Similar News