మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) లుకలుకలు బయటపడిన సంగతి తెలిసిందే. సాక్షాత్తూ అధ్యక్షకార్యదర్శులే ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకోవడం - నిధులు దుర్వినియోగం అయ్యాయని రచ్చకెక్కడంతో `మా` పరువు మర్యాద రోడ్డున పడింది. మీడియా - యూట్యూబ్ చానెళ్లు ఆవురావురుమంటూ టీఆర్ పీ గేమ్ ఆడేశాయి. నిధుల దుర్వినియోగం నిరూపణ చేయలేదు. నరేష్ డిమాండ్ చేసినందుకు హై కమీషన్ వేయలేదు. అంతా ట్రాష్ అని తేలిపోయింది.
ఇకపోతే ఈ ఉదంతంలో మా అధ్యక్షుడు శివాజీరాజాపై మెగాస్టార్ సీరియస్ అయ్యారని ప్రచారం సాగుతోంది. శివాజీ - నరేష్ లతో విడివిడిగా మాట్లాడి సామరస్య పూర్వకంగా సమస్యకు పరిష్కారం వెతికే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. ఇంటి గుట్టు మీడియాకి ఇచ్చేయడంపై చిరు సీరియస్ అయ్యారని ప్రచారం సాగుతోంది.
అదంతా ఒక కోణం అనుకుంటే.. అమెరికాలో చిరు అతిధిగా నిర్వహించిన `మా సిల్వర్ జూబ్లీ ఈవెంట్` పెద్ద సక్సెసై కోటి ఫండ్ వసూలవ్వడంతో అదే ఉత్సాహంలో మరిన్ని ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు చేయాలనుకున్న `మా`కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. తదుపరి మహేష్ తో పెద్ద ఈవెంట్ ప్లాన్ చేశారు. నాగార్జున - ప్రభాస్ - ఎన్టీఆర్ వంటి స్టార్లు `మా` సొంత భవంతి నిధి కోసం సాయం చేస్తామన్నారు. ఈవెంట్లతో ఫండ్ రైజింగ్ చేస్తామన్నారు. వివాదాల నేపథ్యంలో ఇప్పుడు వీళ్లంతా వస్తారా? రారా? అన్న సందిగ్ధత నెలకొంది.
మా ఈసీ మెంబర్ బెనర్జీ వెళ్లి కలిస్తే మహేష్ రారని - ఇలాంటి వివాదాల వేళ కుదరదని నమ్రత ఖరాకండిగా చెప్పేశారట. ఆ మేరకు ప్రఖ్యాత ఆంగ్ల దినపత్రిక కథనం వెలువరించింది. ఒకవేళ ఇదే నిజమైతే దీని వల్ల 5-10కోట్లు తెచ్చే ఈవెంట్ అర్ధాంతరంగా ఆగిపోయినట్టే. మూవీ ఆర్టిస్టుల సంఘం సొంత భవంతి నిర్మాణానికి ఆరంభమే బోలెడన్ని అడ్డంకులు తప్పనట్టే. అయితే మహేష్ రానని అన్నారో లేదో - నమ్రత తరపు బృందాలు ధృవీకరించాల్సి ఉందింకా. నమ్రత మ్యాడమ్ సదరు ఆంగ్ల పత్రిక కథనంపై అధికారికంగా ట్వీట్ చేస్తారేమో చూడాలి.